Begin typing your search above and press return to search.
అయిన దానికి కాని దానికి ఎందుకీ రోత పబ్లిసిటీ?
By: Tupaki Desk | 31 July 2020 9:45 AM ISTవినేవాడు ఉంటే చెప్పేవాడుంటాడు! కొందరి తీరు ఇలానే ఉంటుంది. నేను ఏది చెబితే అదే న్యూస్ అనుకునే బాపతు పనికిమాలిన సంత టాలీవుడ్ లో అంతకంతకు పెరుగుతోంది. ఈ సంతలో కొందరు అనవసరమైన వాటిని పబ్లిసిటీకి వాడుకుని స్వీయ ప్రాపకానికి పాల్పడుతున్నారు. దీనివల్ల మీడియా సహా ఎదుటివారి విలువైన సమయం వృథా అవ్వడమే గాక అదో రోతలా మారుతోంది.
ప్రచారానికి ఏమీ లేక..! అది ప్రచారానికి అనర్హం అని తెలిసీ జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు. నిజానికి ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. ఏడాది పూర్తయిన తరువాత ఓ ఐదు ఏళ్లకు లేకపోతే పదేళ్లకు మళ్ళీ ఆ సినిమా రిలీజై ఇన్నేళ్లు అయ్యింది అని గుర్తు చేస్తే బాగుంటుంది..! కానీ పబ్లిసిటీ కుతితో కొందరు వెర్రి వెంగలప్ప వ్యాపకాలకు తెరతీయడమే దురదృష్టకరం. ఇది ఎదుటివాడి టైమ్ తినేయడమేననేది జనం ఆవేదన.
ఈ పిచ్చి పీక్స్ వెర్రి వ్యాపక ధోరణి ఇటీవల మరింత బలపడింది. ఇప్పుడు కరోనా క్రైసిస్ ఇండస్ట్రీ మీద పడటంతో స్వీయ మర్ధనా మరీ ఎక్కువైంది. ``మా సినిమా రిలీజ్ అయ్యి మూడేళ్లు అయ్యింది..! పదకొండేళ్ళ అయ్యింది..! 7 ఏళ్ళు అయ్యింది`` అంటూ పోస్టర్లు వేసి ప్రెస్ నోట్ లు రిలీజ్ చేస్తున్నారు..! ఇలాంటివి చేసేవాళ్లకు కాస్తయినా జ్ఞానం లేకపోయినా చూసేవాళ్లకు అయినా ఉండాలనే మెజారిటీ వర్గాల ఆవేదన. ఏదిపడితే అది రిలీజ్ చేసేస్తే ఎలా? దానికి అర్థంపర్థం ఉండనక్కర్లేదా? పైగా దీనికి మీడియా వంతపాడడం సబబేనా? పని లేనివాళ్లు ఏదైనా రిలీజ్ చేయచ్చు కానీ..! దీని వల్ల ఆయా సంస్థల క్రెడిబిలిటీ .. బ్రాండ్ వాల్యూ తగ్గడం ఖాయమని సినిమా వాళ్లే కామెంట్స్ చేస్తున్నారు. అయిన దానికి కాని దానికి ఈ రోత ఎందుకు? అని తిట్టేవాళ్లే ఇప్పుడు ఎక్కువ. ఇదోరకం పిచ్చి పీక్స్ అతి ధోరణి అని విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్ల ఆట కట్టించడానికి మీడియానే కొన్ని రూల్స్ ప్రతిపాదిస్తుందేమో చూడాలి.