Begin typing your search above and press return to search.

'విక్రమ్' నే వద్దు అన్నాడా?

By:  Tupaki Desk   |   8 Feb 2019 5:54 AM GMT
విక్రమ్ నే వద్దు అన్నాడా?
X
హీరోగా పేరు తెచ్చుకుంటే సరిపోదు.. నిజంగా హీరో అనిపించుకోవాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఏంటి ఆ నిర్ణయం అంటే... చియాన్ విక్రమ్! ప్రయోగాల మాంత్రికుడు లాగా ప్రతీ సినిమాలో సరికొత్త వేరియేషన్ ని చూపించాలి అని తెగ కష్ట పడుతూ ఉంటాడు విక్రమ్. అయితే ఆ ప్రయోగాలకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ అయితే వస్తున్నాయి కానీ, కమర్షియల్ గా మాత్రం సినిమాలు ఆడటం లేదు. అయినా ఎక్కడా తగ్గడం లేదు విక్రమ్, వరుస ప్రయోగాలతో దూసుకెళ్తున్నాడు.

ఇదిలా ఉంటే, తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డిని తమిళ్ లో తన కుమారుడు ధృవ్ తో తెరకెక్కించాలి అని ప్లాన్ చేసి తన గురువు అయిన బాలాకు ఆ భాద్యతను అప్పగించాడు విక్రమ్. ఇక బాలా కూడా తనదైన శైలిలో ఈ సినిమాని తెరకెక్కించాడు...అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి..అంతా బావుంది అని అనుకున్న క్రమంలో... సినిమా మొత్తం పూర్తి అయ్యింది. ఫర్స్ట్ కాపీ చూసిన విక్రమ్ కి సినిమా నచ్చకపోవడం, సినిమాను మళ్లీ వేరే దర్శకుడితో షూట్ చెయ్యమని చెప్పాడు అని సమాచారం. అదేంటి అంటే, ఈ సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా అని, సినిమా తాను ఆశించినట్లుగా లేదు అని, అయితే ఇది ఇక్కడితో ఆపేసి, వేరే దర్శకుడితో సినిమాను తెరకెక్కించమని, ఎంత నష్టమైన తాను భరిస్తాను అని, విక్రమ్ తెలిపినట్లు తమిళ తంబీల నుంచి వినిపిస్తున్న వార్త.

అయితే ఇక్కడ ఇంకో చిక్కు ఏంటి అంటే, సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయిపోయే పరిస్థితుల్లో ఉండగా విక్రమ్ సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిర్మాతలకు షాక్ ఇచ్చే అంశం. నాకు తెలిసి ఇలాంటి సాహసం ఇప్పటివరకూ ఎవ్వరూ చేసి ఉండరేమో మన చిత్ర పరిశ్రమలో. ఎంతైనా ప్రయోగాల మాంత్రికుడు కదా..ఆ మాత్రం సాహసం చెయ్యకపోతే ఎలా అని ఆనుకున్నాడో ఏమో కానీ, మొత్తంగా చూసుకుంటే మాత్రం అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ ని మళ్లీ తెరకెక్కించాల్సిన పరిస్థితి. మరి ఈ మార్పు సినిమా వాయిదా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.