Begin typing your search above and press return to search.

వీర‌య్య ప్రీ రిలీజ్ కి శ్రుతిహాస్ ఢుమ్మా అందుకేనా?

By:  Tupaki Desk   |   9 Jan 2023 8:30 AM GMT
వీర‌య్య ప్రీ రిలీజ్ కి శ్రుతిహాస్ ఢుమ్మా అందుకేనా?
X
'వీర‌సింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజ‌రైన శ్రుతిహాస‌న్ 'వాల్తేరు వీర‌య్య' ఈ వెంట్ కి ఢుమ్మా కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. ఆర‌వ తేదీని ఒంగోలు లోజ‌రిగిన 'వీర‌సింహారెడ్డి' ఈవెంట్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది శ్రుతిహాస‌న్. త‌న‌దైన శైలి స్పీచ్ తో ఆక‌ట్టుకుంది. కానీ నిన్న‌టి రోజున జ‌రిగిన వైజాగ్ వీర‌య్య ఈవెంట్కి మాత్రం హాజ‌రు కాలేదు. దీంతో ఆమెకేమైంది? హైద‌రాబాద్ లో ఉండి మ‌రీ వీర‌య్య వేడుక‌కి రాలేదు? ఏంటి అంటూ! ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొస్తుంది.

తాజాగా శ్రుతిహాసన్ హాఫ్ సెంట్ కి కార‌ణాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఒంగోలు కాక‌ని త‌ట్టుకోలేక అమ్మ‌డికి జ్వ‌రం వ‌చ్చిందిట‌. ఈవెంట్ ముగించుకుని ఇంటికెళ్లే స‌రికి నీర‌సం మొద‌లైందిట‌. అటుపై చిన్న‌గా జులుబు..జ్వ‌రం కూడా వ‌చ్చిందిట‌. డౌట్ వ‌చ్చి కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకుందిట‌. రిజ‌ల్ట్ తెలియ‌దు గానీ...బాగా నీర‌సంగా ఉండ‌టంతో శ్రుతిహాస‌న్ వైజాగ్ ఈవెంట్కి రాలేద‌ని స‌న్నిహ‌త వ‌ర్గాల సమాచారం.

ఇదే సంద‌ర్భాన్ని చిరంజీవి స‌ర‌ద‌గా వీరయ్య వేదిక‌పై మ‌రోక‌రంగా గుర్తు చేసారంటున్నారు. ఒంగోలు శ్రుతి ఏమి తిన్నాదో? ఎవ‌రు బెదింరించారో? తెలియ‌దు. ఈ ఫంక్ష‌న్ కి రాలేక‌పోయింద‌ని స‌ర‌దాగా అన్నారు. అలాగే ఆమె ప‌నిత‌నాన్ని కొనియాడారు.

సినిమాలో ఎంతో చ‌క్క‌గా న‌టించిద‌ని..తన పాత్ర‌కు నూరు శాతం న్యాయం చేసింద‌ని.. మైన‌స్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లోనూ డాన్సులు చేసింద‌ని.. త‌న పాత్ర సినిమాలో ఎంతో కీల‌కంగా ఉంటుంద‌ని చిరు ప్ర‌శంసించారు. మొత్తానికి వేడుక‌కు రాక‌పోయినా చిరు కితాబులైతే అందేసుకుంది. ఒంగోలులో బాల‌య్య నోట ప్ర‌శంస‌లు అందుకోగా... వైజాగ్ వేదిక చిరు నుంచి నీరాజ‌నాలు అందుకేసుకుంది.

ఓ ర‌కంగా శ్రుతి హాస‌న్ చాలా ల‌క్కీ అని చెప్పాలి. ఒకేసారి ఇద్ద‌రు స్టార్ హీరోలు బాల‌య్య‌..చిరంజీవితో తెర‌ను పంచుకున్న సినిమాలు రిలీజ్ అవ్వ‌డం అన్న‌ది ఓ సంచ‌ల‌నం. అందులోనూ సంక్రాంతి రావ‌డం అన్న‌ది అన్నింటికి మంచిని గొప్ప విష‌యం. ఈ రెండు సినిమాలు హిట్ అయితే క‌మ‌ర్శియ‌ల్ హీరోయిన్ గా శ్రుతి హాసన్ పేరు ఇండ‌స్ర్టీలో మారు మ్రోగిపోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.