Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు చేసింది ప‌వ‌న్ ఎందుకు చేయ‌డం లేదు?

By:  Tupaki Desk   |   25 Feb 2022 11:20 AM IST
ఆ ఇద్ద‌రు చేసింది ప‌వ‌న్ ఎందుకు చేయ‌డం లేదు?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన క్రేజీ మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ `భీమ్లానాయ‌క్‌`. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద తొలి షో నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుని థియేట‌ర్ల వ‌ద్ద సునామీ సృష్టిస్తోంది. చాలా రోజుల త‌రువాత ప‌వ‌న్ నుంచి ఊర మాస్ మూవీ రావ‌డంతో ఫ్యాన్స్ థియేట‌ర్ల వ‌ద్ద ఓ రేంజ్ లో హంగామా చేయ‌డం మొద‌లు పెట్టారు. రిలీజ్ కు రెండు మూడు రోజుల నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ హ‌ల్ చ‌ల్ మొద‌లైంది.

ఇద‌గిలా వుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ప‌వ‌న్ సినిమా వ‌స్తోందంటే థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ చేసే హంగామా వేరే వెలెల్లో వుంటుంది. అంతే కాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. అయితే త‌మ హీరో సినిమా గురించి తాము ట్వీట్ లు చేయ‌డ‌మే కాకుండా త‌మ‌హీరో హీరో ట్వీట్ చేస్తే చూడాల‌న్న‌ది ఫ్యాన్స్ కోరిక‌ట‌. అయితే అది ప‌వ‌న్ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు.

ఒక సినిమా విష‌యంలో ప‌వ‌న్ ఎంత వ‌ర‌కు వుండాలో అంత వ‌ర‌కే వుంటుంటారు. కేవ‌లం డ‌బ్బు కోస‌మే తాను సినిమాలు చేస్తున్నాన‌ని చాలా సంద‌ర్భాల్లో ప‌వన్ క‌ల్యాణ్ క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రిలీజ్ కి ముందు వ‌ర‌కు త‌న సినిమా ప్ర‌మోష‌న్ ల‌లో పాల్గొనే ప‌వ‌న్ ఆ త‌రువాత వ్య‌క్తిగ‌త ప్ర‌యోష‌న్ ల‌కు దూరంగా వుంటుంటార‌న్న‌ది అంద‌రికి దెలిసిన విష‌య‌మే. అయితే ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌పోయినా ఫ‌ర‌వాలేదు కానీ త‌న సినిమా గురించి ఇత‌రులు ట్వీట్ చేసిన‌ట్టుగా ప‌వ‌న్ ట్వీట్ చేస్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి.

త‌న అభిమానుల్ని హుషారెత్తించ‌డానికి సినిమా రిలీజ్ కు ముందే ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనే ప‌వ‌న్ క‌నీసం `భీమ్లానాయ‌క్` హ్యాష్ ట్యాగ్ ని అయినా నెట్టింట ట్యాగ్ చేయ‌డం లేద‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నార‌ట‌. ఈ సినిమా గురించి మంత్రి కేటీఆర్‌, మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అభిమానుల‌కు జోష్ ని అందించారు. అయితే ఆ ప‌ని ప‌వ‌న్ ఎందుకు చేయ‌డం లేద‌న్న‌ది ఫ్యాన్స్ వాద‌న‌గా తెలుస్తోంది.

రాజ‌కీయ వ్య‌వ‌హ‌రాల‌కు సంబంధించిన ట్వీట్ లు.. అధికార పార్టీకి సంబంధించిన పోస్ట్ లు పెడుతూ నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ప‌వ‌న్ సొంత సినిమాల‌ని ఎందుకు ప్ర‌మోట్ చేసుకోవ‌డం లేద‌ని, ఈ విష‌యంలో ప‌వ‌న్ ఎందుకు ఆలోచించ‌డం లేద‌ని అభిమానులు వాపోతున్నార‌ట‌.