Begin typing your search above and press return to search.

మేకర్స్ పై వకీల్ సాబ్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారా..??

By:  Tupaki Desk   |   17 March 2021 1:30 AM GMT
మేకర్స్ పై వకీల్ సాబ్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారా..??
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుధీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. నిజానికి వకీల్ సాబ్ గతేడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్డౌన్ వలన ఈ ఏడాది సమయం కుదిరింది. ఇప్పుడు కూడా వకీల్ సాబ్ వేసవి కానుకగా ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్లతో పాటు పాటలతో ఈ సినిమా పై అభిమానులలో భారీ హైప్ క్రియేట్ అయింది. రాజకీయ నాయకుడిగా జనాల సమస్యల గురించి మాట్లాడే పవన్.. ఈ సినిమాలో జనం తరపున వాదించే న్యాయవాది పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫ్యాన్స్ లాయర్ కోట్ ధరించన పవన్ ను చూసి సంబరపడి పోతున్నారు.

అయితే వకీల్ సాబ్ మూవీ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ అనేది విదితమే. తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా మేకర్స్ పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సినిమా విడుదలకు సరిగ్గా నెల కూడా సమయం లేదు. పవర్ స్టార్ ఫ్యాన్ బేస్ చూస్తే దేశవ్యాప్తంగా ఉంది. అలాంటప్పుడు ఇంతవరకు వకీల్ సాబ్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టలేదు. ఆల్రెడీ సినిమా పై జనాల్లో ఓ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రచారం కూడా చేయకపోతే జనాల్లో ఇంటరెస్ట్ కోల్పోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకు వి సినిమా విషయంలో కూడా ప్రొడ్యూసర్ ఇలాగే చేశాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దిల్ రాజు ఫ్యాన్స్ అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా వకీల్ సాబ్ ప్రమోషన్స్ ప్రారంభిస్తే బాగుంటుందని సినీవర్గాల టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో శృతిహాసన్, అంజలి, నివేదా థామస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.