Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మూవీపై బజ్ లేదేంటి..?

By:  Tupaki Desk   |   17 March 2021 11:30 PM GMT
పాన్ ఇండియా మూవీపై బజ్ లేదేంటి..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టొరీ ''రాధే శ్యామ్''. 1970స్ వింటేజ్‌ ప్రేమకథగా ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ - గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్‌ - ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జులై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాలకు ఉన్న బజ్ 'రాధేశ్యామ్' కు లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

'రాధే శ్యామ్' నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనే చిత్ర యూనిట్ ప్రమోట్ చేస్తోంది. పదేళ్ల కిందట 'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి రెండు రొమాంటిక్ ఫ్యామిలీ మూవీస్ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత మాస్ బాట పట్టి అలాంటి జోనర్ టచ్ చేయలేదు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. తనలోని రొమాంటిక్ యాంగిల్ ని మళ్ళీ చూపించడానికి 'రాధే శ్యామ్' సినిమాతో వస్తున్నాడు. అయితే 'బాహుబలి' తర్వాత ప్రేక్షకులు ప్రభాస్ నుంచి మాస్, యాక్షన్ సినిమాలు ఆశిస్తున్నారని 'సాహో' సినిమాతోనే అర్థం అయింది. ప్లాప్ టాక్ తోనే 'సాహో' ఓ రేంజ్ లో వసూళ్ళు రాబట్టింది.

ఈ క్రమంలో వస్తున్న లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' ప్రేక్షకుల్లో అంచనాలు పెంచలేకపోతోందని.. ఇప్పటి వరకు వదిలిన ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ పూర్తిగా నిరాశపరిచాయనే కామెంట్స్ వస్తున్నాయి. ఫైనల్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం నుంచి ఏ అప్డేట్ వచ్చినా అది ట్రోలింగ్ కి గురవడమే కాకుండా.. అంచాలను తగ్గిస్తూ వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్టు 'రాధే శ్యామ్' పై అంచనాలు పెంచే కంటెంట్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.