Begin typing your search above and press return to search.

వాయిదాల ప‌ర్వంలోకి మెగా హీరో మూవీ..?

By:  Tupaki Desk   |   19 May 2021 4:30 PM GMT
వాయిదాల ప‌ర్వంలోకి మెగా హీరో మూవీ..?
X
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాతో కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర - బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి - విలక్షణ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆ మధ్య ప్రకటించారు. ఐతే అదే రోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' రిలీజ్ ని కూడా ఫిక్స్ చేశారు. దీంతో 'గని' సినిమాని వాయిదా వేస్తారని అందరూ అనుకున్నారు.

అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కార‌ణంగా అటు 'రాధేశ్యామ్' ఇటు 'గ‌ని' రెండు సినిమాల కంటెంట్ రెడీ అవ్వలేదు. ఈ కార‌ణంగా ఇప్పుడు రెండు చిత్రాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఇదిలావుండగా 'గని' ఔట్ ఫుట్ విషయంలో దర్శక హీరోల మధ్య విభేదాలు వచ్చాయని ఈ మధ్య బాగా రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల వరుణ్ తేజ్ ఎడిట్ చేసిన 'గని' ఫుటేజీని చూసి అసంతృప్తిని వ్యక్తం చేశాడని చెప్పుకున్నారు. అయితే లేటెస్టుగా దర్శకుడు కిరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరుణ్ తో విభేధాలనే వార్తలను ఖండించారు. వరుణ్ ఈ సినిమా పట్ల చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడని.. ఆ వార్తలన్నీ పూర్తిగా బేస్ లెస్ రూమర్స్ అని కిరణ్ అన్నారు. కోవిడ్ సోకడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న కిరణ్.. పరిస్థితులు అనుకూలించిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు.