Begin typing your search above and press return to search.

పవన్ రీ ఎంట్రీ సినిమా హడావిడి కనిపించడం లేదేంటి..?

By:  Tupaki Desk   |   3 March 2021 2:30 AM GMT
పవన్ రీ ఎంట్రీ సినిమా హడావిడి కనిపించడం లేదేంటి..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ''వకీల్ సాబ్'' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్ నిర్మించారు. హిందీ 'పింక్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. పవన్ కు జోడీగా శృతి హసన్ నటించింది. నివేధా థామస్ - అంజలి - అనన్య కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా లేట్ అవుతూ వచ్చి ఇప్పుడు ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రిలీజ్ దగ్గర పడుతున్నా 'వకీల్ సాబ్' పై హైప్ క్రియేట్ అవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ని చాలా గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి ఫ్యాన్స్ మాత్రం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా హైప్ అంతగా కనిపించడం లేదు. మిగతా సినిమాల వారు రెగ్యులర్ గా ఏదొక అప్డేట్ తో హడావిడి చేస్తుంటే వకీల్ సాబ్ మాత్రం సైలెంటుగా ఉంటున్నాడు. మాములుగా పవన్ సినిమా అంటే ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులోను ఇది కంబ్యాక్ మూవీ. అయినప్పటికీ 'వకీల్ సాబ్' పై బజ్ క్రియేట్ అవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తగట్టే ఈ మధ్య వదిలిన టీజర్ కి కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అందుకే ఇప్పటి నుంచి ప్రమోషన్స్ గట్టిగా చేయాలని పీకే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దిల్ రాజు తన సినిమాలని ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోను ఇది పవర్ స్టార్ తో ఆయన చేస్తున్న మొదటి సినిమా. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' ని ప్రమోట్ చేసే విషయంలో దిల్ రాజు ఏదైనా కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతాడేమో చూడాలి.