Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో బిజీ .. అందుకేనా టాలీవుడ్ కి నోనో!
By: Tupaki Desk | 2 Dec 2020 1:00 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ సీనీ ఎంట్రీ చాలా సాధా సీదాగా జరిగిన విషయం తెలిసిందే. తొలుత జాన్వీ ని హీరోయిన్ గా పరిచయం చేస్తారా? అన్న ప్రశ్నలకు శ్రీదేవి పెద్దగా స్పందించలేదు. ఇంగ్లీష్ వింగ్లీష్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు మీడియాకు సరైన సమాధానాలివ్వలేదు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని జాన్వీని హీరోయిన్ గా పరిచయం చేశారు. ముందు భారీగా అరంగేట్రం చేయించాలని ప్లాన్ చేసినా కరణ్ జోహార్ కి అప్పగించడంతో చిన్న మూవీ `ధడక్`(సైరఠ్ రీమేక్)తో అరంగేట్రం చేయించాల్సి వచ్చింది.
ఆ తరువాత జాన్వీ ఘోస్ట్ స్టోరీస్- అంగ్రేజీ మీడియం- గుంజన్ సక్సేనా వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు చిత్రాలున్నాయి. రాజ్ కుమార్ రావుతో కలిసి `రూహ్ అఫ్జా`.. కార్తీక్ ఆర్యన్ తో కలిసి `దోస్తానా 2` చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో `దోస్తానా 2` చిత్రీకరణ దశలో వుంది. `రూహ్ అఫ్జా` రిలీజ్ కి రెడీ అవుతోంది. కరణ్ తో హిస్టారికల్ మూవీ తక్త్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే బాలీవుడ్ లో నటించినా.. జాన్వీ తనలా దక్షిణాదిలో సినిమాలు చేయాలని శ్రీదేవి కోరిక. కానీ ఇప్పటికీ జాన్వీ దక్షిణాదిలో సినిమాలు చేయలేకపోతోంది. తెలుగులో `జగదేక వీరుడు అతిలోక సుందరి`కి సీక్వెల్ చేస్తే ఆ మూవీ ద్వారా జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. పైగా జాన్వీ బాలీవుడ్ లో బిజీ బిజీ.. అందుకే తెలుగులో వద్దనుకుంటోందా? సౌత్ కి ఇప్పట్లో రావాల్సిన అవసరం లేదని భావిస్తోందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. జాన్వీ తెలుగులో విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో కలిసి నటించాలని వుందని చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. ఆ రోజు త్వరలోనే కావాలని అతిలోక సుందని ముద్దుల కూతురు తెలుగు తెరపై తుళుక్కున మెరవాలని.. శ్రీదేవిలా మెస్మరైజ్ చేయాలని ఆశిద్ధాం.