Begin typing your search above and press return to search.

శేఖ‌ర్ మాస్ట‌ర్ అంత సీక్రెట్ ఎందుకో?

By:  Tupaki Desk   |   11 Feb 2023 5:11 PM IST
శేఖ‌ర్ మాస్ట‌ర్ అంత సీక్రెట్ ఎందుకో?
X
టాలీవుడ్ , కోలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫ‌ర్స్ డైరెక్ట‌ర్లుగా మారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించ‌డ‌మే కాకుండా హీరోలుగానూ, ద‌ర్శ‌కులుగానూ ఇప్ప‌టికీ రాణిస్తున్న విష‌యం తెలిపిందే. హీరోలు, నిర్మాత‌ల‌తో వున్న చ‌నువు, సెట్ లో వారికున్న అవ‌గాహ‌న కార‌ణంగా చాలా మంది కొరియోగ్రాఫ‌ర్ లు ద‌ర్శ‌కులుగా రాణించాల‌ని విశ్వ‌ప్ర‌యత్నాలు చేశారు. అందులో ఇద్ద‌రు ముగ్గ‌రు మాత్ర‌మే పేరు తెచ్చుకున్నారు. ద‌ర్శ‌కులుగా తమ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

ప్ర‌భుదేవా, రాఘ‌వ లారెన్స్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌, బృంద వంటి వారు కొరియోగ్రాఫ‌ర్లుగా మంచి గుర్తింపుని స్టైల్ ని ఏర్ప‌ర‌చుకుని ఆ త‌రువాత ద‌ర్శ‌కులుగా మారారు. ప్ర‌భుదేవా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ద‌ర్శ‌కుడిగా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతున్నారు. ఇక రాఘ‌వ లారెన్స్ కూడా ద‌ర్శ‌కుడిగా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగా, హీరోగానూ కొన‌సాగుతున్నారు.

రీసెంట్ గా మ‌రో డ్యాన్స్ మాస్ట‌ర్ బృంద ద‌ర్శ‌కురాలిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం మొద‌లు పెట్టింది. తొలి ప్ర‌య‌త్నంగా 'హే సినామిక‌' అంటూ ల‌వ్ స్టోరీని తెర‌కెక్కించింది. దాని వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేక‌పోవ‌డంతో 'కోన‌సీమ థ‌గ్స్‌' అంటూ యాక్ష‌న్ సినిమాకు శ్రీ‌కారం చుట్టింది. ఈ సినిమాపైనే త‌న కెరీర్ ఆధార‌ప‌డివుంది. ఇదిలా వుంటే మ‌రో క్రేజీ కొరియోగ్రాఫ‌ర్ కూడా సైలెంట్ గా మెగా ఫోన్ ప‌ట్క‌టిన‌ట్టుగా తెలుస్తోంది.

క్రేజీ స్టార్ ల‌కు ప్ర‌భుదేవా, లారెన్స్ ల త‌రువాత అత్యంత ప్రియ‌మైన కొరియోగ్రాఫ‌ర్ గా మారిన శేఖ‌ర్ వీజె ద‌ర్శ‌కుడిగా మారుతున్నార‌ట‌. ఓంకార్ డైరెక్ట్ చేసిన ప‌లు టీవీ షోల‌కు, డ్యాన్స్ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన శేఖ‌ర్ డ్యాన్స్ మాస్ట‌ర్ గా త‌న‌కున్న అనుభ‌వంతో ఓ క‌థ‌ని సిద్ధం చేసుకుని ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేయ‌డానికి రెడీ అయిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ ని మొద‌లు పెట్టాడ‌ని, అయితే ఫ‌స్ట్ కాపీ వ‌చ్చాకే ఫ‌స్ట్ ర‌షెస్ చూసుకున్నాకే మీడియా మేందుకు రావాల‌ని భావిస్తున్నాడ‌ట‌.

శేఖ‌ర్ మాస్ట‌ర్ ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ గా పేరున్న ప్ర‌భుదేవా వ‌ద్ద ప‌లు సినిమాల‌కు వ‌ర్క్ చేశాడు. త‌నంటే శేఖ‌ర్ మాస్ట‌ర్ కు వ‌ల్ల‌మాలిన అభిమానం. అత‌ని ద్వారా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిన శేఖర్ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడిగానూ ప్ర‌భుదేవా త‌ర‌హాలో త‌న‌దైన మార్కుని క్రియేట్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇందులో భాగంగానే సైలెంట్ గా ద‌ర్శ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి రంగంలోకి దిగిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.