Begin typing your search above and press return to search.

రష్మిక మూడేళ్ళ నాటి ట్వీట్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే..?

By:  Tupaki Desk   |   9 April 2022 3:39 AM GMT
రష్మిక మూడేళ్ళ నాటి ట్వీట్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే..?
X
ప్రస్తుతం వరుస విజయాలతో క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోన్న హీరోయిన్ రష్మిక మందన్నా. తెలుగు తమిళ కన్నడ హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. అందం అభినయంతో పాటుగా అమ్మడికి కాస్త లక్ కూడా కలిసొచ్చిందనే అనుకోవాలి. కోలీవుడ్ స్టార్ హీరో లేటెస్టుగా విజయ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది రష్మిక.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా Thalapathy66 మూవీ సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. స్వతహాగా విజయ్ ఫ్యాన్ అయిన రష్మిక.. ఆయన పక్కన నటించే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. సంతోషంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నా గతంలో హీరో విజయ్ గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది.

విజయ్ - అట్లీ కాంబోలో తెరకెక్కే ఓ సినిమాలో రష్మిక హీరోయిన్ ఫిక్స్ అయిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ ఆ చిత్రంలో నటించడం లేదంటూ కన్నడ బ్యూటీ ఓ ట్వీట్ పెట్టింది. ''విజయ్ - అట్లీ సినిమాలో మీరు నటిస్తున్నారా అంటూ అందరూ నన్ను అడుగుతున్నారు. కానీ నాకు ఈ చిత్రంలో అవకాశం రాలేదు. త్వరలోనే వారితో కలసి వర్క్ చేసే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. తప్పకుండా నేను వారితో పని చేస్తాను'' అని రష్మిక ట్వీట్ లో పేర్కొంది.

రష్మిక మందన్న 2018 నవంబర్ 27న ఈ ట్వీట్ చేసింది. అయితే దాదాపు మూడున్నరేళ్లకు ఇప్పుడు విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఈ బ్యూటీకి లభించింది. దీంతో అభిమానులు దాన్ని రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు విజయ్ - రష్మిక జంటను తెర పై చూడబోతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే 'దళపతి66' చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ బైలింగ్విల్ లో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చానున్నారు. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే.. త్వరలోనే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న 'పుష్ప: ది రూల్' చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించే 'యానిమల్' మూవీలో రష్మిక నే హీరోయిన్ గా తీసుకున్నారు.

అలానే సిద్దార్థ్ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను' అనే మూవీలో నటిస్తోంది రష్మిక. ఇదే క్రమంలో 'గుడ్ డే' సినిమాలో అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. దుల్కర్ సల్మాన్ - డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో వస్తోన్న సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇవి కాకుండా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అందులో కొన్ని సక్సెస్ అయినా రష్మిక మందన్నా క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లిపోయే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో నేషనల్ క్రష్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.