Begin typing your search above and press return to search.

బుచ్చి బాబు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్‌?

By:  Tupaki Desk   |   5 Sep 2021 1:30 AM GMT
బుచ్చి బాబు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్‌?
X
ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో పరిచయం అయిన బుచ్చిబాబు తదుపరి సినిమా విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. ఉప్పెన సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన్ను ఆఫర్లు ముంచెత్తాయి. కాని ఆయన మాత్రం చాలా ఆచి తూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఉప్పెన సినిమాకు ముందే ఎన్టీఆర్‌ తో బుచ్చిబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉప్పెన సక్సెస్‌ తో ఎన్టీఆర్ సినిమా చేద్దామని బుచ్చి బాబు తో అన్నాడట. దాంతో ఎన్టీఆర్ కోసం బుచ్చి బాబు స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కమిట్‌ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అందుకే ఎన్టీఆర్‌ తో కంటే ముందు యంగ్‌ హీరో వైష్ణవ్ తేజ్ తోనే మళ్లీ సినిమా చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఉప్పెన తర్వాత బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా వైష్ణవ్‌ కూడా రెండు మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. కనుక ఆ సినిమాలు పూర్తి అయ్యే వరకు బుచ్చి బాబు తో సినిమాను వైష్ణవ్‌ తేజ్‌ చేసే అవకాశం లేదు. కనుక బుచ్చి బాబు తదుపరి సినిమా ఏంటా అంటూ మళ్లీ చర్చ మొదలు అయ్యింది.

తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఒక యంగ్‌ హీరోకు బుచ్చి బాబు కథ చెప్పాడని.. ఆయన ఓకే చెప్పాడని.. అతి త్వరలోనే వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ యంగ్‌ హీరో ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు కాని బుచ్చి బాబు కొత్త సినిమా కు రంగం సిద్దం అయ్యింది.. ఒక యంగ్‌ హీరో తో ఈ ఏడాది చివరి వరకు సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు బుచ్చి బాబు సినిమాను మొదలు పెట్టలేక పోవడం పై కొందరు పెదవి విరుస్తున్నారు.

ఉప్పెనతో వచ్చిన సక్సెస్ ను క్యాష్‌ చేసుకుని వెంటనే సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా మంచి బజ్ ఉండేది. కాని బుచ్చి బాబు కన్ఫ్యూజ్‌ అవుతూ కొత్త ప్రాజెక్ట్‌ ను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ హిట్ పడ్డా కూడా వెంటనే సినిమాను చేయక పోవడం కూడా గురువు నుండి బుచ్చి బాబు నేర్చుకున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్‌ ఇప్పటి వరకు సినిమాను విడుదల చేయలేక పోయాడు. అందుకే గురువుకు తగ్గ శిష్యుడు అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.