Begin typing your search above and press return to search.

బాల‌య్య ఇంత‌లా సిగ్గుప‌డుతున్నాడేంటి?

By:  Tupaki Desk   |   28 Nov 2022 1:30 PM GMT
బాల‌య్య ఇంత‌లా సిగ్గుప‌డుతున్నాడేంటి?
X
న‌ట‌సింహ బాల‌య్య లో యాంగర్ ని అంతా చూసారు. ఆయ‌న‌కి కోపం న‌షాళానికి పాకిందంటే? శివుడు తాండ‌వం ఆడిన‌ట్లే ఉంటుంది. వెన‌కా...ముందు చూడ‌కుండా చెంప చెళ్లు మ‌నిపిస్తారు. ఇంకా వేదిక‌ల‌పై కొన్ని విష‌యాల్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా మాట్లాడ‌టం ఆయ‌న‌కే చెల్లింది. ఇది బాల‌య్య‌లో ఒక యాంగిల్.

మ‌రో కోణంలో బాల‌య్య అంత మంచి మ‌న‌సు గ‌ల వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌రేమో అనిపించేంత అభిమానం..ప్రేమ సైతం కురిపించ‌డం ఆయ‌న‌కే తెలుసు. దుఖం వ‌చ్చినా..సంతోషం వ‌చ్చినా ప‌ట్ట‌లేరు. ఆ వేదిక ఎలాంటిదైనా స‌రే త‌న మ‌న‌సులో భావాల్ని బ‌య‌ట పెట్టేయ‌డం ఆయ‌న నైజాం. బాల‌య్య లో ఆ ల‌క్ష‌ణం అంద‌రికీ న‌చ్చేది.

ఆయ‌న ఎంత యాంగ‌ర్ అయినా ఈ ఒక్క విష‌యంలో అంద‌రు మ‌న‌సుల‌కు ద‌గ్గ‌రైపోతారు. మ‌రి బాలయ్య సిగ్గు ప‌డితే ఎలా ఉంటుందో తెలుసా? అది ఇలా ఉంటుంద‌ని తొలిసారి ఆహా వేదిక‌పై తెలిసింది. రాధిక ఏదో రొమాంటిక్ గా ప్ర‌శ్నించ‌గా బాల‌య్య న‌వ్వుతూ..త‌ల కింద‌కు దించేసుకుని సిగ్గులు ఒల‌క‌బోస్తున్నారు. బాల‌య్య లో సాధార‌ణంగా ఇలాంటివన్ని సినిమాల్లోనే చూస్తాం.

తొలిసారి బాల‌య్య లో రియ‌ల్ సిగ్గ‌రిని చూపించారు. ఇది చూసి అభిమానులు మ‌రింత మురిసిపోయారు. ఇలా సిగ్గు ప‌డిపోతుంది మా బాల‌య్య బాబేనా? అంటూ న‌వ్వేస్తున్నారు. జై బాల‌య్య అంటూ కామెంట్లూ పెట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య హీరోగా 107వ సినిమా వీర సింహారెడ్డి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

సంక్రాంతి కానుక‌గా బాక్సాఫీస్ ని షక్ చేయ‌డానికిరెడీ అవుతున్నారు. ఆయ‌న‌కి పోటీగా `వాల్తేరు వీరుయ్య‌`తో మెగాస్టార్ చిరంజీవి బ‌రిలోకి దిగుతున్నారు. ఇద్ద‌రు బాక్సాఫీస్ వ‌ద్ద యుద్దానికి త‌ల‌ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి`...`ఖైదీ నెంబ‌ర్ 150` త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి స‌న్నివేశం త‌లెత్తాలేదు. తాజాగా 2023 లో ఆ స‌న్నివేశం ఎదుర‌వుతుంది. మ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద ఎవ‌రిది పై చేయి అవుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.