Begin typing your search above and press return to search.

దిల్ రాజుకి ఆ ప్రేమ నచ్చిందా

By:  Tupaki Desk   |   15 Nov 2017 10:03 PM IST
దిల్ రాజుకి ఆ ప్రేమ నచ్చిందా
X
ప్రేమతో మీ కార్తీక్.. ఈ సినిమా గురించి కొన్ని రోజుల క్రితం వరకూ జనాలకు పెద్దగా తెలియదు. థియేట్రికల్ ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి.. అంతకు మించిన ప్లస్ పాయింట్ అయిపోయాడు దిల్ రాజు. లో బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ప్రేమతో మీ కార్తీక్ ను.. దిల్ రాజు రిలీజ్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సబ్జెక్టుల ఎంపిక విషయంలో దిల్ రాజు చాలా అలర్ట్ గా ఉంటాడు. డిసెంబర్ లో ఈయన రెండు సినిమాలు రిలీజ్ చేయనున్నాడు. నిర్మాతగా నాని హీరోగా రూపొందిన ఎంసీఏ.. నిర్మాణ భాగస్వామిగా సాయి ధరం తేజ్ మూవీ జవాన్ చిత్రాలను విడుదల చేయనున్నాడు. ఇంతలోనే మళ్లీ ప్రేమతో మీ కార్తీక్ వంటి చిన్న చిత్రాన్ని ఎంచుకోవడం.. ఆశ్చర్యపరిచే విషయమే. అయితే.. ఈ సినిమాలో దిల్ రాజును బాగా అట్రాక్ట్ చేసిన అంశం ఒకటి ఉందని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన శతమానం భవతిలో కనిపించిన ఫ్లేవర్.. ప్రేమతో మీ కార్తీక్ లోనూ ఉంటుందట. ఇంటర్వెల్ సమయానికి ఇది రివీల్ అవుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని దిల్ రాజు బాగా నమ్మకంగా ఉన్నాడని.. అందుకే ప్రేమతో మీ కార్తీక్ ను ఎంచుకున్నాడని అంటున్నారు. దిల్ రాజు జడ్జిమెంట్ పై అందరికీ బాగానే నమ్మకం. మరి ఆ నమ్మకం ఏ మేరకు నిలబడుతుందో.. ఈ శుక్రవారం వరకూ ఆగితే తెలిసిపోతుంది.