Begin typing your search above and press return to search.

ఇలియానా కి కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఎందుకు..?

By:  Tupaki Desk   |   7 Jan 2023 5:33 AM GMT
ఇలియానా కి కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఎందుకు..?
X
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు తన ఫాం పూర్తిగా కోల్పోయి ఫెడవుట్ అయ్యింది. సౌత్ లో సూపర్ స్టార్ డం ఉన్న టైం లోనే బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే అక్కడకు వెళ్లిన ఇల్లి బేబ్ అక్కడ సినిమాలు చేస్తున్న టైం లో తెలుగు, తమిళ సినిమా ఆఫర్లు వచ్చినా సరే చేయనని చెప్పేసింది. ఆ దెబ్బతో అమ్మడికి ఛాన్స్ లు రాకుండా అయ్యాయి. బాలీవుడ్ లో కూడా ఆశించిన స్థాయిలో క్లిక్ అవకపోవడంతో మళ్లీ సౌత్ సినిమాల వైపు చూడగా ఇక్కడ దర్శక నిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు.

ఇక సినిమాలు ఎలాగు లేవని రష్యన్ ఫోటో గ్రాఫర్ తో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్న ఇలియానా అతనితో దిగిన ఫోటోలతో రచ్చ చేసింది. అతని నుంచి దూరమయ్యాక సోలో ఫోటోలతో సోషల్ మీడియాలో అలరించింది అమ్మడు.

ప్రస్తుతం హీరోయిన్ గా కాదు కనీసం స్పెషల్ ఐటం సాంగ్స్ ఆఫర్స్ వచ్చినా చేస్తానని అంటుందట ఇలియానా. ఆ ఛాన్స్ లు కూడా ఇచ్చేందుకు రెడీ గా లేరు మన వాళ్లు. ఎలాగు ఆమె పాపులారిటీ తగ్గింది కాబట్టి ఐటం సాంగ్ చేసినా పెద్దగా క్లిక్ అయ్యే ఛాన్స్ లేదని వారి ఆలోచన.

కానీ ఇలియానా ఫ్యాన్స్ మాత్రం ఆమెను కనీసం స్పెషల్ సాంగ్స్ లో అయినా చూడాలని కోరుతున్నారు. ఇలియానా ఇన్ బాక్స్ లో మళ్లీ ఆమెని తెలుగు సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇల్లి బేబ్ కూడా అందుకు రెడీ అంటున్నా ఇక్కడ దర్శక నిర్మాతలే అమ్మడికి ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. రీసెంట్ గా ఫ్యాన్స్ తో చేసిన చాట్ లో అవసరమైతే స్పెషల్ సాంగ్స్ అయినా చేస్తానని అన్నది ఇలియానా. సినిమాలు చేయకపోయినా తన బికినీ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది అమ్మడు.

ఆ షో ఏదో సినిమాలో చేస్తే కాస్త క్రేజ్ అయినా దక్కుతుంది కదా అని అంటున్నారు నెటిజన్లు. స్టార్ ఛాన్స్ లు రాకపోయినా యంగ్ హీరోల సినిమాల్లో అయినా ఇలియానా చేస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

అయితే ఫేడవుట్ లో ఉన్నా తనతో సినిమా అంటే మాత్రం రెమ్యునరేషన్ భారీగా అడుగుతుందట ఇల్లి బేబీ అందుకే ఒకరిద్దరు ఛాన్స్ ఇద్దామని వెళ్లినా పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసి షాక్ ఇచ్చిందట. మరి అసలే అవకాశాలు లేవు అన్నప్పుడు రేటు కాస్త తగ్గించుకుంటే బాగుండేదని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.