Begin typing your search above and press return to search.

విక్ర‌మ్ కే కుమార్ సైలెంట్ అయిపోయారేంటి?

By:  Tupaki Desk   |   23 Nov 2020 12:00 PM IST
విక్ర‌మ్ కే కుమార్ సైలెంట్ అయిపోయారేంటి?
X
`మ‌నం` లాంటి క్లాసిక్ అరుదుగానే వ‌స్తుంటాయి. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన చివ‌రి చిత్రం ఒక మెమ‌రీగా అభిమానుల్లో నిలిచిపోయింది. అక్కినేని కుటుంబానికి ది బెస్ట్ ట్రీట్ ఇచ్చిన మూవీగా రికార్డుల‌కెక్కింది. ఇక ఈ సినిమాతో తెలుగులో విక్ర‌మ్ కే కుమార్ ఇమేజ్ అమాంతం మారిపోయింది. అత‌డికి అక్కినేని అభిమాన లోకం సాహో అంటూ రెడ్ కార్పెట్ వేసింది.

ఆ క్ర‌మంలోనే మ‌నం సీక్వెల్ గురించి చాలా కాలంగా చ‌ర్చ సాగుతూనే ఉంది. నిరంత‌రం అక్కినేని అభిమానులు ఈ ప్ర‌స్థావ‌న తెస్తూనే ఉన్నారు. అయితే ప్ర‌తిసారీ ఉంటుంది అన్న సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే కానీ స్క్రిప్టు అయితే రెడీ కాలేదు. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌తో విక్ర‌మ్ కే సినిమా గురించి చ‌ర్చ సాగింది కానీ మ‌నం సీక్వెల్ ప్ర‌స్థావ‌న రాలేదు.

అయితే ఇటీవ‌లే సామ్ ఓ చిట్ చాట్ లో మ‌నం సీక్వెల్ ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. సీక్వెల్ తీస్తే అక్కినేని కుటుంబ హీరోలంతా న‌టిస్తార‌ని అన‌డంతో మ‌రోసారి దానిపై అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది.

కానీ స్క్రిప్టు ఉందా? విక్ర‌మ్ సిద్ధ‌మేనా? అయినా విక్ర‌మ్ కే కుమార్ సైలెంట్ అయిపోయారేమిటో! నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నా కానీ దాని మీద ఇటీవ‌ల‌ ఎలాంటి అప్ డేట్ లేదు. నానితో తీసిన గ్యాంగ్ లీడ‌ర్ త‌రువాత విక్ర‌మ్ ని నుంచి మ‌రో సినిమా అప్ డేట్ లేదు. మ‌నం సీక్వెల సంగ‌తి కూడా ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి చెప్పాల్సి ఉంటుంది.