Begin typing your search above and press return to search.

అందుకే హిందీ జెర్సీకి నో చెప్పింద‌ట‌

By:  Tupaki Desk   |   17 Feb 2020 9:16 AM GMT
అందుకే హిందీ జెర్సీకి నో చెప్పింద‌ట‌
X
నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన `జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్ లో అల్లు అర‌వింద్-దిల్ రాజు బృందం రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ లో షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి అక్క‌డా తెర‌కెక్కిస్తున్నాడు. షాహిద్ స‌ర‌స‌న టీవీ ఆర్టిస్ట్ మృనాల్ ట‌క్క‌ర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. అయితే ఇందులో ముందుగా షాహిద్ కు ఫెయిర్ గా ర‌ష్మిక మంద‌న‌ను అనుకున్నారు.

అర‌వింద్- దిల్ రాజు స‌ల‌హా మేర‌కు గౌత‌మ్ ర‌ష్మిక‌ను ఎంపిక చేసారు. ర‌ష్మిక కూడా న‌టించ‌డానికి అంగీక‌రించిందని...బాలీవుడ్ లో మంచి సినిమాతో ప‌రిచ‌యం అవుతుంద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ త‌ర్వాత అంతే వేగంగా రీమేక్ నుంచి ర‌ష్మిక‌ త‌ప్పుకుంది. దీనిక కార‌ణం తెలుగులో ఉన్న క్రేజ్ కార‌ణంగా భారీగా పారితోషికం డిమాండ్ చేసింద‌ని..అందుకే అర‌వింద్ లైట్ తీసుకున్నార‌ని ప్ర‌చారం సాగింది. అయితే తాజాగా అస‌లు విష‌యం వేరే ఉంద‌ని తెలుస్తోంది. పారితోషికం కార‌ణం కాద‌ని.. కేవ‌లం డేట్లు అడ్జస్ట్ చేయ‌లేక త‌ప్పుకున్నాన‌ని ఓ ఇంట‌ర్వూలో ర‌ష్మిక వెల్ల‌డించింది.

సోష‌ల్ మీడియా లో వ‌చ్చిన వార్త‌ల‌న్ని పుకార్లేన‌ని ఖండించింది. గ‌తంలో అల్లు అర‌వింద్ గారి బ్యాన‌ర్లో సినిమాలు చేసి స‌క్సెస్ అయ్యాను. నాకు న‌టిగా అవ‌కాశాలు క‌ల్పించిన వారు. జెర్సీ ఛాన్స్ వ‌స్తే ఎలా మిస్ చేసుకుంటాను...కేవ‌లం డేట్లు అడ్జ‌స్ట్ కాకే త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం బ‌న్నీతో క‌లిసి కొత్త సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నానంది. మార్చిలో ఆసినిమా సెట్స్ కు వెళ్తుంది. అందులో నా పాత్ర రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. ఆ రోల్ త‌ప్ప‌కుండా మంచి పేరు తీసుకొస్తుంద‌ని తెలిపింది.