Begin typing your search above and press return to search.

పుష్ప కు కారణం చెప్పిన ఫాహద్‌

By:  Tupaki Desk   |   29 Aug 2021 12:30 PM GMT
పుష్ప కు కారణం చెప్పిన ఫాహద్‌
X
మలయాళ క్రేజీ స్టార్‌ ఫాహద్‌ ఫాజిల్ కు ఇప్పటికే టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన పలు సినిమా లు తెలుగు లో డబ్బింగ్‌ అయ్యి మంచి గుర్తింపును దక్కించుకున్న విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా తో ఫాహద్ నేరుగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్న ఫాహద్‌ ఫాజిల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు లో ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా పుష్ప లో విలన్ పాత్రకు ఎందుకు ఓకే చెప్పావు అంటూ ఫాహద్ ను తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఆయన నుండి వచ్చింది.

పుష్ప సినిమా కథను.. ఆ పాత్రను నాకు చెప్పిన సమయంలో చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఇప్పటి వరకు నేను చాలా రకాల పాత్రల్లో నటించాను. కాని ఈ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే నేను ఈ సినిమాలో నటించాలని అనుకున్నాను. సుకుమార్ గారి దర్శకత్వంలో ఇలాంటి పాత్రతో టాలీవుడ్ లో ఎంటర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని తప్పకుండా ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతాను అనే నమ్మకంను పుష్ప విలన్‌ చెప్పుకొచ్చాడు. ఫాహద్ ఫాజిల్ ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్‌ లుక్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. గుండుతో పాహద్ కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఫాహద్ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో పుష్ప సినిమా పై మలయాళం లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా పుష్ప సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప పార్ట్‌ 1 రూపొందుతుంది. పుష్ప 2 సినిమా ను వచ్చే ఏడాది లో మొదలు పెట్టనున్నట్లుగా చెబుతున్నారు.