Begin typing your search above and press return to search.
వార్ లో నెక్ట్స్ లెవల్ ఏంటో చూపించాలనే..!
By: Tupaki Desk | 6 Nov 2020 10:30 AM ISTబ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అయిపోతూ అగ్ర హీరోలంతా టాలీవుడ్ లో హీట్ పెంచేస్తుంటే చరణ్ మాత్రం ఇంకా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అతడి కోసం ఇప్పటికే పలువురు అగ్ర దర్శకులు నిర్మాతలు క్యూలో ఉన్నా.. దేనికీ సంతకం చేసేందుకు మాత్రం ససేమిరా అనేస్తున్నాడు. అసలు దీనికి కారణమేమిటి? అన్నదానిపై పదే పదే అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఆసక్తికర సంగతి తెలిసింది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ RRR చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ తరువాత చరణ్ తన తదుపరి సోలో చిత్రాన్ని ఇంకా లాక్ చేయలేదు.
మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య లో 40 నిమిషాల నిడివి ఉండే పాత్రను పోషిస్తున్నాడు. ఆ మూవీ చిత్రీకరణ ముగిసే నాటికి చెర్రీకి పూర్తి క్లారిటీ వచ్చేస్తుందట. అటుపై తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తారు. అప్పటివరకూ దర్శకులు వినిపించిన కథలు వినడంలోనే బిజీగా ఉంటారట.
చరణ్ తదుపరి దర్శకుడు అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే చాలా పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంతలో తాజా వార్త ఏమిటంటే.. చరణ్ ఆర్.ఆర్.ఆర్ తరువాత పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ పై సంతకం చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాడు. నెక్ట్స్ లెవల్ ఏంటో చూపించాలనే పంతంతోనే ఇలా చేస్తున్నాడట.
ఈ కథనాలన్నీ రియాలిటీగా మారితే చరణ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్రకటించే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దేనికైనా తొలిగా ఆర్.ఆర్.ఆర్ విడుదలయ్యే వరకు వేచి ఉండాలి. ఆ సినిమా విజయం కూడా చాలా విషయాల్ని డిసైడ్ చేస్తుందనడంలో సందేహమేం లేదు. ధృవ సీక్వెల్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అలాగే ఇతర దర్శకులు వినిపించిన యూనివర్శల్ కాన్సెప్టులకు రామ్ చరణ్ అంగీకరించే వీలుందని సమాచారం. ఇక ప్రభాస్.. బన్ని.. తారక్ ఇప్పటికే వరసగా పాన్ ఇండియా దర్శకుల్ని లాక్ చేస్తూ అంతకంతకు కాంపిటీషన్ ని పెంచేస్తుంటే చెర్రీ రేసులో వెనకబడేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. అందుకే ఈ గేమ్ ప్లాన్ అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.