Begin typing your search above and press return to search.

అసలు దీపికా పదుకొణె కి ఏమైంది? హాస్పిటల్‌ కి ఎందుకు వెళ్లింది?

By:  Tupaki Desk   |   29 Sept 2022 2:04 PM IST
అసలు దీపికా పదుకొణె కి ఏమైంది? హాస్పిటల్‌ కి ఎందుకు వెళ్లింది?
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆమె తల్లి కాబోతుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు ఆమె సీరియస్‌ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది అంటూ మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఆమె ఆరోగ్యం విషయంలో గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది.

ఇటీవల హైదరాబాద్‌ లో ప్రాజెక్ట్‌ కే షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. దాంతో వెంటనే ఆమెను హైదరాబాద్‌ లోని ప్రముఖ హాస్పిటల్‌ కు తీసుకు వెళ్లడం జరిగింది. అక్కడ ఆమెకు వైద్యం అందించిన వైద్యులు విశ్రాంతి అవసరం అంటూ సూచించారట.

తాజాగా మళ్లీ దీపిక పదుకునే ముంబయిలోని ఒక ప్రముఖ హాస్పటిల్‌ లో రాత్రి సమయంలో హుటా హుటిన తరలించబడ్డారు. ఆ సమయంలో ఆమె భర్త రణ్వీర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. హుటా హుటిన ఆసుపత్రికి ఆమెను తరలించడం తో ఏం జరిగిందా అంటూ అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అయ్యింది.

ఇప్పటి వరకు అధికారికంగా దీపికా పదుకొణె యొక్క సమస్య ఏంటీ అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. మొన్న రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారని.. ఇబ్బంది పడ్డారని అందుకే ఆసుపత్రికి తరలించారని మాత్రమే సమాచారం అందుతోంది.

అంతుకు మించి ఎలాంటి అప్‌డేట్‌ కూడా రావడం లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది రణ్వీర్‌ సింగ్‌ అయినా క్లారిటీ ఇస్తే బాగుంటుందని దీపికా పదుకొణె అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.