Begin typing your search above and press return to search.
చిరు దూరంగా వున్నారెందుకని?
By: Tupaki Desk | 16 Feb 2023 11:42 AMమెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నాలుగు సినిమాలు పోటీపడినా చిరు మాత్రమే ఈ సంక్రాంతి బరిలో విజేతగా నిలవడం తెలిసిందే. బాబి డైరెక్ట్ చేసిన ''వాల్తేరు వీరయ్య' ఈ సంక్రాంతికి అనూహ్య విజయాన్ని సాధించిన ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. చిరు నటించిన చిత్రాల్లో అత్యధికంగా 200 కోట్లకు మించి వరల్డ్ వైడ్ గా వసూళ్లని రాబట్టి మరోసారి చిరు సత్తా ఏంటో నిరూపించింది.
ఇదిలా వుంటే గత కొంత కాలంగా రామ్ చరణ్ ప్రాజెక్ట్ లలో ఇన్ వాల్వ్ అవుతూ స్క్రిప్ట్ లు వింటూ వస్తున్న మెగాస్టార్ ఈ మధ్య తనని సంప్రదిస్తున్న దర్శకులని చరణ్ కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేయండి అని అడుగుతున్నాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిందే.
చరణ్ ప్రాజెక్ట్ లతో పాటు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా చేస్తున్న పలు ప్రాజెక్ట్ ల విషయంలోనూ చిరు సూచనలు సలహాలు ఇస్తుంటారు. చిరు కుమార్తె సుష్మిత తన భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓ ప్రొడక్షన్ కంపనీని ప్రారంభించిన విషయం తెలిసిందే.
తొలి ప్రయత్నంగా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లతో 'షూటౌట్ ఎట్ ఆలేర్' సిరీస్ ని నిర్మించింది. ఇది పెద్దగా ప్రభావాన్ని చూపించకపోవడంతో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో 'సేనాపతి'ని నిర్మించిన నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసింది. దీనికి ప్రముఖుల ప్రశంసలు దక్కాయే కానీ భారీ స్థాయిలో దీనికి రావాల్సిన మైలేజ్ రాలేదు. సుష్మితకు మేకర్ గా చెప్పుకోదగ్గ గుర్తింపు దక్కలేదు.
ప్రస్తుతం సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంతోష్ శోభన్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో సాగే మూవీగా 'శ్రీదేవి శోభన్ బాబు' మూవీని నిర్మించింది. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ గత కొంత కాలంగా ఆలస్యం అవుతూ వస్తోంది. '96' ఫేమ్ గౌరీ కృష్ణ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ మూవీనిఎట్టకేలకు ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీకి చిరు ఎలాంటి సపోర్ట్ చేయకుండా దూరంగా వుంటున్నారు.
చిన్న సినిమాలకు చిరు ఎప్పుడు సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు. కానీ సుష్మిత ప్రాజెక్ట్ కోసం మాత్రం పెద్దగా ఆసక్తిని చూపించడంలేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. చిరు 'శ్రీదేవి శోభన్ బాబు' మూవీని సపోర్ట్ చేయకపోవడానికి బలమైన కారణమే వుందట. సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోవడంతో చిరు ని ప్రమోషన్స్ కోసం తీసుకొచ్చి ఆయన పేరుని చెడగొట్టడం ఇష్టం లేకే సుష్మిత ఆయనకు దూరంగా వుంటోందట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.