Begin typing your search above and press return to search.

నిహారిక పెళ్లిలో 'అన్నా కళ్యాణ్‌' కనిపించలేదేం?

By:  Tupaki Desk   |   11 Dec 2020 10:27 AM IST
నిహారిక పెళ్లిలో అన్నా కళ్యాణ్‌ కనిపించలేదేం?
X
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అకీరా మరియు ఆద్యలతో కలిసి పవన్‌ రాజస్థాన్‌ లో జరిగిన వివాహంకు హాజరు అయ్యాడు. పవన్‌ మూడవ భార్య అయిన అన్నా లెజ్నేవా ఈ వివాహ వేడుకలో పాల్గొనక పోవడంపై పలువురు పలు రకాల కామెంట్స్‌ చేస్తున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడుకలో ప్రత్యక ఆకర్షణగా నిలిచిన అన్నా లెజ్నేవా ఈ వివాహ వేడుకలో పాల్గొనక పోవడం పట్ల ప్రత్యేక కారణం ఏమైనా ఉందా.. లేదంటే పవన్‌ తో ఆమెకు ఏమైనా విభేదాలా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ సమయంలో మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అన్నా లెజ్నేవా ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. పిల్లలతో ఆమె గత నెలలోనే రష్యాకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రతి డిసెంబర్‌ నెలలో అన్నా క్రిస్మస్‌ వేడుకల కోసం రష్యా వెళ్లడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అందుకే ఈ ఏడాది కూడా ఆమె అక్కడకు వెళ్లారు. నిహారిక పెళ్లి ఉండగా కూడా ఎందుకు ఆమె అక్కడకు వెళ్లారు అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. అన్నా లెజ్నేవా హైదరాబాద్‌ లో లేకపోవడం వల్ల నిహారిక పెళ్లికి హాజరు కాలేదు అంటూ మెగా కాంపౌండ్‌ బలంగా చెబుతుంది.