Begin typing your search above and press return to search.
ఆర్ఆర్ఆర్.. అల్లు అర్జున్ మౌనమేల?
By: Tupaki Desk | 14 March 2023 9:38 AMఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ ఆస్కార్ అవార్డు ఆ పాటకి వచ్చిన కూడా ఇండియా మొత్తానికి వచ్చినంత గర్వంగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులు అందరూ కూడా రియాక్ట్ అవుతూ ఆర్ఆర్ఆర్ టీమ్ కి విషెస్ చెబుతున్నారు.
అలాగే దీనిపై లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు టాప్ స్టొరీగా కథనాలు ప్రసారం చేస్తున్నారు. లైవ్ డిబేట్ లు పెడుతూ ఉన్నారు. ఇండియా సినిమా ఆస్కార్ దక్కించుకుంటుంది అని చెప్పడానికి ఇది మొదటి అడుగు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మన టాలీవుడ్ స్టార్స్ పవన్ కళ్యాణ్ వరకు ప్రతి ఒక్కరు ట్వీట్ చేసి విషెస్ చెప్పారు. అయితే ఆర్ఆర్ఆర్ టీమ్ కి ఈ స్థాయిలో అందరూ ప్రశంసిస్తూ ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం విశేషం.
ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే సర్వత్రా చర్చ నడుస్తుంది. అసలే ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ విడిపోయి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటున్నారు. అలాగే మెగా ఫ్యాన్స్ నుంచి సపరేట్ అయిన అల్లు అర్జున్ బన్నీ ఆర్మీ అంటూ తన ఫ్యాన్స్ ని కొత్తగా రిప్రజెంట్ చేస్తున్నాడు. అలాగే తన ఈవెంట్స్ లో కూడా మెగా జపం చేయడం మానేశారు.
తనకి తాను యునిక్ గా ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటీ పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా బన్నీ మారిపోయాడు. ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మన సినిమా ఆస్కార్ గెలుచుకుంది అంటే కచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంటుంది.
బాలీవుడ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడంపై ట్విట్టర్ లో అభినందించారు. మరి బన్నీకి ఏమైంది అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది. అయితే అల్లు అర్జున్ సుకుమార్ మూవీ షూటింగ్ లో ప్రస్తుతం ఉన్న నేపధ్యంలో ఫోన్స్ కి దూరంగా ఉండి ఉంటారని, అందుకే సినిమాపై అల్లు అర్జున్ ఇంకా రియాక్ట్ కాలేదని బన్నీ ఫాన్స్ అంటున్నారు. మరి వాస్తవం ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.