Begin typing your search above and press return to search.

బన్నీ లేకపోవడం హాట్ టాపిక్ అయిందే!

By:  Tupaki Desk   |   23 Aug 2019 1:30 AM GMT
బన్నీ లేకపోవడం హాట్ టాపిక్ అయిందే!
X
మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఫ్యాన్స్ విషయానికి వచ్చేసరికి మెగా ఫ్యాన్స్ అని అందరినీ కామన్ గా పిలుస్తున్నప్పటికీ కొందరు మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలకు తమకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ పై కొంతకాలంగా మెగా ముద్ర నుంచి బైటపడి సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడని కూడా కామెంట్లు వినిపించాయి. ఇక అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరిగిన హంగామా కూడా అందరికీ తెలిసిన విషయమే.

మధ్యలో అంతా సర్దుకుందని అందరూ అనుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ పై అదే రకమైన విమర్శలు వస్తున్నాయి. 'సైరా' టీజర్ విడుదలైన తర్వాత వెంటనే షేర్ చేయకపోవడం.. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో అల్లు అర్జున్ కనిపించకపోవడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. కానీ అల్లు అర్జున్ మాత్రం నిన్న రాత్రే తన ట్విట్టర్ ఖాతా ద్వారా మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన చిరుభక్తిని చాటుకుంటూ ఒక ఒక ట్వీట్ పెట్టాడు. దాంతో పాటుగా 'సైరా' టీజర్ ను కూడా పోస్ట్ చేశాడు.

అయితే దీంతో సంబంధం లేకుండా బన్నీపై విమర్శలు మాత్రం సాగుతున్నాయి. మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో బన్నీ పాల్గొనకపోవడానికి అసలు కారణం ఇంకా తెలియదు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొంటున్నాడు కాబట్టి మళ్ళీ పవన్ ఫ్యాన్స్ తో ఏదైనా ఇబ్బంది వస్తుందేమోనని వేడుకలకు దూరంగా ఉన్నాడేమో అని కొందరు అంటున్నారు. అయితే బన్నీ అభిమానులు మాత్రం చిరంజీవికి ట్విట్టర్ ద్వారా బన్నీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడని.. పర్సనల్ గా కూడా విషెస్ చెప్పి ఉంటాడేమో అని వెనకేసుకొస్తున్నారు.