Begin typing your search above and press return to search.

సాహో అందుకే రిజెక్ట్ చేసిందట

By:  Tupaki Desk   |   29 Nov 2017 6:45 PM IST
సాహో అందుకే రిజెక్ట్ చేసిందట
X
కొంత మంది హీరోయిన్స్ తీసుకునే నిర్ణయాలు ఒక్కో సారి వారి కెరీర్ కి గుడ్ అవ్వచ్చు లేదా బ్యాడ్ కూడా అవ్వచ్చు. స్టార్ హీరో - హిట్ డైరెక్టర్ అని సినిమా ఒప్పుకుంటే ఒక్కోసారి కెరీర్ మొత్తం డౌన్ అవ్వచ్చు. ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. కానీ తారల లైఫ్ కి మాత్రం ఆ విషయం చాలా సీరియస్. అయితే అదే తరహాలో ప్రభాస్ సినిమా అని తెలిసిన ఒక బాలీవుడ్ హీరోయిన్స్ సినిమా చేయనని చెప్పేసిందట.

ప్రస్తుతం ప్రభాస్ - సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా నిర్మాతలు శ్రద్దా కపూర్ కంటే ముందు చాలా మంది హీరోయిన్స్ పేర్లు అనుకున్నారట. అందులో అనుష్క, కత్రినా కైఫ్, ఆలియా భట్, సోనం కపూర్ మరియు దిషా పటాని అలాగే మరికొంత మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా ఉన్నాయి. అనుష్కని ఫిట్నెస్ ప్రాబ్లమ్ వల్ల తీసుకోలేదు. ఇక మరికొంత మంది రెమ్యునరేషన్ - డేట్స్ వంటి వివిధ కారణాల వల్ల సెట్ అవ్వలేదు. అయితే ఆలియా భట్ మాత్రం సినిమా కథను నచ్చినా కూడా చేయనని మర్యాదగా చెప్పేసిందట.

అసలైతే ఆలియా బాహుబలి చుసిన తర్వాత ప్రభాస్ కి పిచ్చ ఫ్యాన్ అయ్యింది. మరి సినిమా చేయడానికి ఏమైందనే విషయంలోకి వెళితే.. సినిమా కథ చాలా బావుందట. కానీ కథానాయిక పాత్రకి మాత్రం అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో చేయలేను అని వివరించిందట. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో నటిస్తే పాత్రకు మినిమమ్ ఇంపార్టెన్స్ ఉండాలని ఎదో గ్లామర్ కోసమే ఉంటే బావుండదనే ఆలోచనతో రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత శ్రద్దా కపూర్ ని ఫైనల్ చేశారు.

ఆలియా బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటివరకు అమ్మడు ఎంచుకున్న సినిమాలన్నిటిలో ఆమె చేసిన పాత్రలు మంచి గుర్తింపును అందుకున్నాయి. ఇక ఇలాంటి టైమ్ లో అలంటి ప్రయోగాలు చేయకూడదని ఆలోచించి సాహో చేయనని చెప్పిందట ఆలియా.