Begin typing your search above and press return to search.
లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు ఇప్పటికైనా స్పందిస్తారా...?
By: Tupaki Desk | 30 May 2020 12:00 PM ISTప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ - మెగా బ్రదర్ నాగబాబు ల మాటల యుద్ధం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీ పెద్దలు తనని పిలవకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం పై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే మెగా బ్రదర్ నాగబాబు స్పందించి బాలయ్యపై ఒక వీడియో ద్వారా విరుచుకుపడ్డారు. నాగబాబు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై నోరు జారొద్దు. మీటింగ్ కు ఎవరిని పిలవాలో కమిటీకి తెలుసు. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బాలయ్య నోరు అదుపులో ఉంచుకోవాలి. బాలయ్య ఒకటంటే.. మేము రెండు మాటలనేందుకు రెడీగా ఉన్నాం. ప్రభుత్వానికీ సినీ ఇండస్ట్రీకి బాలయ్య క్షమాపణలు చెప్పాలి. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు జస్ట్ ఒక హీరో మాత్రమే అంటూ పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై ఇండస్ట్రీ పెద్దలు ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేదు. ఒకరిద్దరు మాత్రం బయటకి వచ్చి అవి వారి పర్సనల్ వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేవు.. వర్గాలు లేవు.. మాకు పార్టీలు లేవు.. మేము సినిమా వాళ్ళం అంటూ మేమంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసారు. కానీ కొంతమంది మాత్రం బాలయ్య వ్యాఖ్యలను తప్పుబడుతుంటే మరికొందరు నాగబాబు చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు.
అయితే ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఇండస్ట్రీలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని పరిష్కరించుకోవాలి కానీ గొడవని పెద్దది చేసుకుంటూ వెళ్లకూడదని టాలీవుడ్ శ్రేయోభిలాషులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ లో ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు ఏమి చేస్తున్నాడని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో ఈగో ఇష్యూస్ వచ్చినప్పుడు మోహన్ బాబు లాంటి లెజెండరీ యాక్టర్ ముందుకొచ్చి వివాదానికి పరిష్కార మార్గాన్ని వెతకాలి కానీ ఇలా అందరిలా సైలెంటుగా ఉంటే ఎలా అని వారు అడుగుతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించిన దాసరి నారాయణ రావు శిష్యుడిగా తన స్థానంలోకి వచ్చి ఇండస్ట్రీలో జరిగే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మోహన్ బాబు ఇప్పుడు అటు నందమూరి ఫ్యామిలీతో ఇటు మెగా ఫ్యామిలీతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు.. అందువలన ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆయన పరిష్కార మార్గాన్ని చూపాలని ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు.
వాస్తవానికి సి. కళ్యాణ్ తమ్మారెడ్డి భరద్వాజ ప్రసన్న కుమార్ నరేష్ లాంటి ఒకరిద్దరు పెద్దలు మాట్లాడారే కానీ లెజెండరీ యాక్టర్స్ ఎవరూ దీనిపై స్పందించలేదు. అందుకే అన్ని విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించే మోహన్ బాబు అయితేనే ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టగలరని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో కూడా ఇండస్ట్రీలో వివాదాలు తలెత్తినప్పుడు మోహన్ బాబు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం మనం చూసాం. అయితే మరికొందరు మాత్రం చిరంజీవి నివాసంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో కానీ.. మినిస్టర్ తలసాని తో సమావేశంలో కానీ.. సీఎం కేసీఆర్ తో మీటింగ్ లో కానీ మంచు ఫ్యామిలీ నుండి ఎవరు కనిపించలేదు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కి కూడా ఈ సమావేశాలకు ఆహ్వానం అందలేదేమో.. అందుకే ఆయన వీటికి దూరంగా ఉంటూ వస్తున్నాడేమో అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. మరి మోహన్ బాబు ఇప్పుడు ఇవ్వన్నీ ఆలోచించకుండా పెట్టి ఆయన అభిమానుల కోరిక మేరకు ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ ఇష్యూ పై స్పందిస్తారేమో చూడాలి.