Begin typing your search above and press return to search.

ఈ సమయంలో అంతటి సాహసం అవసరమా సుక్కు?

By:  Tupaki Desk   |   17 Jun 2020 8:30 AM GMT
ఈ సమయంలో అంతటి సాహసం అవసరమా సుక్కు?
X
మహమ్మారి వైరస్‌ కారణంగా సినిమా పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. సినిమాల షూటింగ్స్‌ మొదలు పెట్టలేక విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను విడుదల చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్‌ సినిమా ఇండస్ట్రీపై కనీసం రెండు నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుందని ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతున్నారు. కనుక సినిమాల బడ్జెట్‌ లు తగ్గించుకోవడంతో పాటు హీరోల పారితోషికాలు కూడా తగ్గించుకోవాలంటూ సూచిస్తున్నారు.

ఈ సమయంలో అంతా బడ్జెట్‌ తగ్గించుకోవాలని చూస్తుంటే దర్శకుడు సుకుమార్‌ మాత్రం పుష్ప చిత్రం బడ్జెట్‌ మొదట్లో అనుకున్న దాని కంటే పెంచుతున్నాడట. ఈ విషయం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో శేషాచలం అడవి సెట్టింగ్‌ ను వేయిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అడవి సెట్‌ ను వేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకు భారీగా ఖర్చు అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఔట్‌ డోర్‌ షూటింగ్‌ సాధ్యం అయ్యే పని కాదు. పైగా అడవుల్లో షూటింగ్‌ కు అస్సలు అనుమతులు ఇవ్వక పోవచ్చు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సుక్కు ఇలా చేస్తున్నాడంటూ టాక్‌ వినిపిస్తుంది.

టాలీవుడ్‌ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు వేయని విధంగా భారీ ఖర్చుతో అడవి సెట్‌ ను దర్శకుడు సుకుమార్‌ వేయిస్తున్నాడట. దాంతో బడ్జెట్‌ ఎక్కువ అవుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాకు ఎక్కువ ఖర్చు పెడితే బిజినెస్‌ అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు మాత్రం సుకుమార్‌ పై చాలా నమ్మకంతో ఉన్నారట.. ఆయన అడిగినంత బడ్జెట్‌ ను పుష్ప కోసం కేటాయించేందుకు రెడీగా ఉన్నారట. అన్నపూర్ణ స్టూడియోలో అడవి సెట్‌ వేయించి పుష్పను తెరకెక్కించినట్లయితే సుకుమార్‌ అరుదైన ఘనత దక్కించుకోవడం ఖాయం.