Begin typing your search above and press return to search.

సూర్య‌కాంత‌మా? మాంత్రికురాలా!!

By:  Tupaki Desk   |   2 Aug 2019 11:47 AM GMT
సూర్య‌కాంత‌మా? మాంత్రికురాలా!!
X
మెగా ప్రిన్సెస్ నిహారిక ఇటీవ‌లే `సూర్య‌కాంతం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కానీ ఆ సినిమాని ప్రేక్ష‌కులు నిర్ధ్వంద్వంగా తిర‌స్క‌రించారు. నిహారిక చ‌క్క‌గా న‌టించినా సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేక‌పోవ‌డంతో ఫెయిలైంది. అంత‌కుముందు హ్యాపి వెడ్డింగ్ స‌న్నివేశం అదే. ఎంచుకునే స్క్రిప్టులు బావున్నా.. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు .. గ్రిప్పింగ్ నేరేష‌న్ లేక‌పోవ‌డం ప్ర‌తిసారీ ఫ్లాపుల‌కు కార‌ణ‌మ‌వుతోంది. అదంతా స‌రే.. ఇటీవ‌ల కొంత గ్యాప్ తీసుకున్న మెగా బ్యూటీ ప్ర‌స్తుతం ఏం చేస్తోంది? అంటే ఇదిగో ఇలా స‌డెన్ గా ఓ కొత్త రూపంతో షాకిచ్చింది.

ఇంత‌కీ ఈ వేషం ఏమిటి? ఏదైనా సినిమా కోస‌మా? లేక బుల్లితెర కోస‌మా? అంటే అదేం కాద‌ట‌. డ్రాగ‌న్ క్వీన్ ఖ‌లీసి రూపంలోకి మారింది. చేతిలో డ్రాగ‌న్ గుడ్లు ప‌ట్టుకుని బొమ్మ‌లాగా ఫోజిచ్చింది. క్వీన్ ఖ‌లీసి పేరు వినేందుకు క‌న్ఫ్యూజ‌న్ గా ఉన్నా.. `గేమ్స్ ఆఫ్ థ్రోన్` వెబ్ సిరీస్ చూసేవారికి ఇదేమీ కొత్త కాదు. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో ఖ‌లీసి పాత్ర‌లో ఎమిలియా క్లార్క్ న‌టించింది. ఎమిలీకి.. ఈ సిరీస్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఇక ప్ర‌తియేటా ప్ర‌తిష్ఠాత్మ‌క బుల్లితెర పుర‌స్కారాల్ని గేమ్స్ ఆఫ్ త్రోన్ గెలుచుకుంటోంది. ఇప్ప‌టికే గేమ్స్ ఆఫ్ థ్రోన్ సీజ‌న్ ఫైన‌ల్ ఎపిసోడ్ తో ముగిసింది. అయినా ఆ జ్ఞాప‌కాల్ని నిహారిక రూపంలో తిరిగి అభిమానులు గుర్తు తెచ్చుకున్నారు ఈ ఫోటో చూశాక‌. గ్రే హెయిర్ తో సూర్య‌కాంతం కాస్తా మాంత్రికురాలిగా మారిందా? అన్న డౌట్ కూడా పుట్టుకొచ్చింది కొంద‌రికి.

అన్న‌ట్టు నిహారిక ఒక కొత్త‌ వెబ్ సిరీస్ ప్రారంభిస్తాన‌ని `సూర్య‌కాంతం` ప్ర‌మోష‌న్స్ లో వెల్ల‌డించారు. అయితే దానికి సంబంధించి తాజాగా ఎలాంటి స‌మాచారం రాలేదు. అలాగే క‌థానాయిక‌గా నాలుగేళ్లు పూర్త‌య్యాక‌ నాన్న గారు పెళ్లి చేసుకోవాల‌ని శ‌ర‌తు విధించారు. ఏమైనా జ‌ర‌గొచ్చు! అంటూ నిహారిక తెలిపారు. మ‌రి ఇంత‌కీ ఆ రెండిటిలో ఏది ముందు జ‌ర‌గ‌బోతోంది అన్న‌ది స‌స్పెన్స్. లేదూ తిరిగి క‌థానాయిక‌గా మ‌రోసారి ల‌క్ చెక్ చేసుకునే ఆలోచ‌న‌లో నిహారిక ఉన్నారా? అన్న‌ది చూడాలి.