Begin typing your search above and press return to search.

సంక్రాంతి బరిలో నిలిచేదెవరు.. గెలిచేదెవరు..?

By:  Tupaki Desk   |   24 Oct 2022 5:30 PM GMT
సంక్రాంతి బరిలో నిలిచేదెవరు.. గెలిచేదెవరు..?
X
సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల పండుగ షురూ అయినట్టే.. స్టార్ సినిమాలన్ని సంక్రాంతికే పోటీ పడుతుంటాయి. పండుగ సెలవులను క్యాష్ చేసుకోవాలని స్టార్స్ తమ సినిమాలను సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఎప్పటిలానే 2023 సంక్రాంతి కూడా కొత్త సినిమాల రిలీజ్ లతో కలర్ ఫుల్ కానుంది. అయితే ఇప్పటికే కొన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అంటుండగా మరికొన్ని సినిమాలు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాయి. ఇక దీపావళి సందర్భంగా రిలీజైన పోస్టర్స్ లో సంక్రాంతి రిలీజ్ అని కొన్ని సినిమాలు షాక్ ఇచ్చాయి.

ఈ సంక్రాంతికి అసలైతే చిరంజీవి వాల్తేరు వీరయ్య.. ప్రభాస్ ఆదిపురుష్.. తమిళ హీరో విజయ్ వారసుడు.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రభాస్ ఆదిపురుష్ పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. సినిమా రిలీజ్ సంక్రాంతికే అనుకున్నా సినిమా వి.ఎఫ్.ఎక్స్ వల్ల లేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. చిరు వాల్తేరు వీరయ్య మాత్రం సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేశాడు. వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్ తో రిలీజ్ డేట్ కూడా మరోసారి ఎనౌన్స్ చేశారు.

మరోపక్క తమిళ హీరో విజయ్ వారసుడు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండే సంక్రాంతి నుంచి సినిమా వాయిదా వేశారని అనుకున్నారు. కానీ సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ దీవాళి పోస్టర్ తో షాక్ ఇచ్చారు. వీటిలో పవన్ హరి హర వీరమల్లు ఒక్కటే సంక్రాంతి నుంచి డ్రాప్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీపావళికి వీరమల్లు టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.

సో పొంగల్ రేసు నుంచి పవన్ తప్పుకున్నట్టే అని ఫిక్స్ అవ్వొచ్చు. పవన్ మిస్ అయినా ఈ మూడు సినిమాలకు ధీటుగా నందమూరి నట సింహం సినిమా వస్తుంది. సంక్రాంతి సెంటిమెంట్ బాలకృష్ణకు బాగా కలిసి వచ్చింది. అందుకే వీర సింహా రెడ్డిని సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేశారు. నందమూరి ఫ్యాన్స్ కి సంక్రాంతిని మరింత కలర్ ఫుల్ చేసేందుకు బాలయ్య సినిమా వస్తుంది.

ఈ రేసులో అక్కినేని హీరో అఖిల్ కూడా ఉంటున్నాడు. అఖిల్ ఏజెంట్ కూడా సంక్రాంతి రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. సంక్రాంతికి ఇప్పటికే నాలుగు సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకోగా అఖిల్ ఏజెంట్ కూడా ఇదే రేసులో వస్తున్నాడు. ఎవరికి వారు సంక్రాంతి రిలీజ్ డేట్ అని ఎనౌన్స్ చేస్తున్నారు.

కానీ అనుకున్నట్టుగా ఈ సినిమాలన్ని సంక్రాంతికి వస్తే థియేటర్ల సమస్య తప్పక వస్తుంది. మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య అక్కినేని హీరో.. వీరితో పాటుగా తమిళ హీరో సినిమా.. బాహుబలి ప్రభాస్ చేసిన ఆదిపురుష్ ఇలా ఇన్ని క్రేజీ మూవీస్ లో ఫైట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.