Begin typing your search above and press return to search.

మ‌హేష్ కోసం ముగ్గురిలో డైల‌మా

By:  Tupaki Desk   |   8 Aug 2019 10:30 AM IST
మ‌హేష్ కోసం ముగ్గురిలో డైల‌మా
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో జెట్ స్పీడ్ తో పూర్త‌వుతోంది. అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత‌లు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ 27 ఛాన్స్ ఎవ‌రికి? అంటే ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఫ‌లానా ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తాను అని మ‌హేష్ ప్ర‌క‌టించ‌లేదు. ఇంత‌వ‌ర‌కూ మ‌హేష్ న‌టించే 27వ సినిమా స్క్రిప్టు కూడా ఫైన‌ల్ కాలేదు.

అయితే ఫ‌లానా ద‌ర్శ‌కుడితో క‌న్ఫామ్ అయిన‌ట్టే అని సామాజిక మాధ్య‌మాల్లో విస్త్ర‌తంగా ప్ర‌చారం సాగుతోంది. కానీ ఏదీ అధికారికంగా ఫైన‌ల్ కాలేద‌ని తెలుస్తోంది. మ‌హేష్ తో సినిమా చేసేందుకు ముగ్గురు న‌లుగురు ద‌ర్శ‌కులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. `అర్జున్ రెడ్డి` ఫేం సందీప్ రెడ్డి వంగా? .. `గీత గోవిందం` ఫేం ప‌ర‌శురామ్.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు మ‌హేష్ తో త‌దుప‌రి సినిమా చేసే వీలుంద‌ని వైర‌ల్ గా ప్ర‌చారం అవుతోంది. అయితే చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఏదీ క‌న్ఫామ్ గా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎవ‌రికి వారు స్క్రిప్టులు ప‌ట్టుకుని రెడీగా ఉన్నారు. మ‌హేష్ వాటిని విని ఫైన‌ల్ చేసి ఖాయంగా సెట్స్ కెళుతున్నాం అని చెప్పే వ‌ర‌కూ ఇది క‌న్ఫామ్ అని చెప్ప‌లేని స‌న్నివేశం నెల‌కొంది.

మ‌రోవైపు `మ‌హ‌ర్షి` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందించిన వంశీ పైడిప‌ల్లితో మ‌రో సినిమా చేస్తాన‌ని మ‌హేష్ స‌క్సెస్ వేడుక‌ల్లో మాటిచ్చారు. అలాగే 2020లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ``రాజ‌మౌళితో ప్ర‌తిసారీ మిస్స‌వుతున్నా. కానీ ఈసారి మిస్స‌వ్వ‌ను`` అని గ‌త ఇంట‌ర్వ్యూలో ప‌క్కాగా చెప్పారు. ఇక రాజ‌మౌళి- మ‌హేష్ కాంబినేష‌న్ సెట్ చేసేందుకు బాహుబ‌లి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా త‌మ‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలుస్తోంది. ప‌ర‌శురామ్.. సందీప్ రెడ్డి వంగా ఇద్ద‌రి వెంటా అగ్ర నిర్మాణ సంస్థ‌లు మైత్రి.. గీతా ఆర్ట్స్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్ధంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి ముందుగా మ‌హేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ప్ర‌స్తుతానికి సూప‌ర్ స్టార్ దృష్టి మొత్తం సెట్స్ పై ఉన్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`పైనే. ఈ సినిమా పూర్త‌యితే కానీ ఏదీ ఖాయంగా చెప్ప‌లేని ప‌రిస్థితి.