Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 2: బన్నీ బెస్ట్.. కాదు నాని బెటర్?

By:  Tupaki Desk   |   19 Feb 2018 9:16 AM GMT
బిగ్ బాస్ 2: బన్నీ బెస్ట్.. కాదు నాని బెటర్?
X
ఎప్పుడు సినిమాలేనా అప్పుడపుడు రియాలిటీ షోలను చుస్తే కూడా చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని నిరూపించిన షో బిగ్ బాస్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ బుల్లితెర షో అంతగా హిట్ అవ్వడానికి అసలు కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో మొదటి సీజన్ రికార్డ్ స్థాయిలో రేటింగ్ ను అందుకుంది. ఇక రెండవ సీజన్ ని కూడా షో నిర్వాహకులు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బిగ్ బాస్ సెకండ్ సీజన్ కి వ్యాఖ్యాతగా ఉండబోడు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. త్రివిక్రమ్ - రాజమౌళి ప్రాజెక్టుల వలన డేట్స్ కుదరలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ రాకుంటే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు తారక్ రాడని ఫిక్స్ అయినా షో నిర్వాహకులు ఇతర హీరోలను వెతికే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అందుకు సమానంగా ఉండే స్టార్ ని తీసుకురావాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది.

ఎక్కువగా ఈ మధ్య బన్నీ అయితే బెస్ట్ అని అందరు అనుకుంటున్నారు. కానీ షో నిర్వాహకులు మాత్రం నాని వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. బన్నీ అయితే రెమ్యునరేషన్ కొంచెం గట్టిగానే ఉంటుంది. అయితే తారక్ రేంజ్ లో ఇతనికి మంచి పేరు ఉంది కాబట్టి సెట్ అవుతాడని చెప్పవచ్చు. ఇక మరోవైపు నాని కూడా మంచి యాక్టరే. నెగిటివ్ టాక్ లేని హీరోల్లో ఇప్పుడు నాని టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. అందులోను ఐఫా వంటి వేడుకల్లో యాంకరింగ్ చేసిన అలవాటు ఉంది. మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ 2 లీడర్ అవుతారో చూడాలి.

అయితే అభిమానులు మాత్రం.. అల్లు అర్జున్ అండ్ నాని మాత్రమే కాకుండా.. రామ్ చరణ్‌ హోస్ట్ చేసినా.. రానా దగ్గుబాటి హోస్ట్ చేసినా చాలా బాగుంటుంది అంటున్నారు. చూద్దాం ఎవరు సెట్టవుతారో!!

మీ అభిప్రాయం ఇక్కడ వోట్ చెయ్యండి