Begin typing your search above and press return to search.

ఇంత‌కీ `బిగ్ బాస్ 4` ఆట‌గాళ్ల‌లో టాలీవుడ్ పిలిచేది ఎంద‌‌రిని?

By:  Tupaki Desk   |   21 Dec 2020 4:30 PM GMT
ఇంత‌కీ `బిగ్ బాస్ 4` ఆట‌గాళ్ల‌లో టాలీవుడ్ పిలిచేది ఎంద‌‌రిని?
X
అవును.. బిగ్ బాస్ విజేత డిసైడ్ అయ్యాడు స‌రే.. ఇంత‌కీ `బిగ్ బాస్ 4`లో టాలీవుడ్ పిలిచేది ఎవ‌రిని? అన్న‌ది విశ్లేషిస్తే నిన్న‌టి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లోనే స‌మాధానం దొరికింది.

ఇక షో ఆద్యంతం మ‌రాఠీ నాయిక మోనాల్ హొయ‌లు కుర్ర‌కారును యంగేజ్ చేయ‌డంతో ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌కు ఆఫ‌ర్లు ఇచ్చందుకు వేచి చూస్తున్నార‌ట‌. బాగా ట్యాప్ విప్ప‌డంలోనూ మోనాల్ ప్ర‌త్యేక‌త‌ను గుర్తించారు యూత్. ఇక‌ మోనాల్ ఇక్క‌డ జీరో కానీ గుజ‌రాతీలో ఫేమున్న క‌థానాయిక‌. తెలుగులో పెద్ద బెట్టింగ్ కోసం ట్రై చేస్తూ బిగ్ బాస్ ఇంట్లో ప్ర‌వేశించింది. ఇంత‌కుముందు అడ‌పాద‌డ‌పా టాలీవుడ్ లో న‌టించినా స‌క్సెస్ రాక ఇబ్బందుల్లో ఉంది. ఇక బిగ్ బాస్ సీజ‌న్ తో వ‌చ్చిన గుర్తింపు త‌న‌కు క‌లిసి రానుంది.

అలాగే ఈ షోలో విజేత‌గా నిలిచిన అభిజీత్ కి ఇప్ప‌టికే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిసింది. శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వ‌చ్చి ఎనిమిదేళ్ల‌యింది. స‌రైన అవ‌కాశాలు రాలేద‌ని స‌క్సెస్ ఇంపార్టెంట్ అని అన్నాడు అభిజీత్. ఇక అత‌డి సాలిడ్ క్యారెక్ట‌ర్ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని రియ‌ల్ లైఫ్ లోనూ అత‌డు ఇంతే గొప్ప‌గా ఉండే మంచి వ్య‌క్తిత్వం కావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని మెగాస్టార్ అంత‌టి వాడే పొగిడేశారు. చూస్తుంటే కొణిదెల బ్యాన‌ర్ లో ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అలాగే నాగార్జున సైతం అత‌డిని ఎంక‌రేజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

ఇందులో పార్టిసిపెంట్ దివి ఒక మోడ‌ల్.. `వేదలమ్` చిత్రంలో మెహ‌ర్ ర‌మేష్ పోలీసాఫీస‌ర్ రోల్ ఇస్తాన‌న్నార‌ట‌. చిరంజీవి సైతం త‌న ప్ర‌తిభ‌కు ఆక‌ర్షితుడై ఆఫ‌ర్ ఇస్తాన‌న్నారు. ఐటెమ్ భామ రోల్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్పుడు కాక‌పోయినా త‌ర్వాత ఆఫ‌ర్ ఉంటుంది.

మ‌రో ఇంటి స‌భ్యుడు మెహ‌బూబ్ డ్యాన్స్ ట్యాలెంట్ ని మెగాస్టార్ తెగ పొగిడేశారు. ఇక్క‌డున్న‌వాళ్ల‌లో ది బెస్ట్ నువ్వే. న‌న్ను నేను చిన్న‌ప్పుడు చూసుకున్న‌ట్టుంద‌ని పొగిడారు. అత‌డికి ఎక్క‌డైనా డ్యాన్స్ కొరియోగ్ర‌ఫీలో ఆఫ‌ర్ ఉంటుందేమో!

ఇక ఇస్మార్ట్ గా 25ల‌క్ష‌లు ప‌ట్టుకెళ్లి సోహైల్ ఆడియో ఫంక్ష‌న్ లేదా సినిమా ఫంక్ష‌న్ల‌కు పిలిస్తే వ‌స్తాన‌ని చిరంజీవి అన్నారు. అలాగే సోహైల్ న‌టించే సినిమాలో చిన్న కామియో రోల్ ఉంటే ఇవ్వ‌మ‌ని చిరు అడ‌గ‌డం కొస‌మెరుపు. ఇక బిగ్ బాస్ 4 ఇంట్లో స్మార్టెస్ట్ గ‌య్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది సోహైల్ అనే చెప్పాలి. అందువ‌ల్ల అత‌డికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. దానికి త‌గ్గ‌ట్టే ఆఫ‌ర్లు ఉంటాయ‌నే ఆకాంక్షిస్తున్నారు.