Begin typing your search above and press return to search.

CHIRU 153 ఎవ‌రు ముందు? ఎవ‌రు త‌రువాత‌?

By:  Tupaki Desk   |   22 Sept 2020 11:45 AM IST
CHIRU 153 ఎవ‌రు ముందు? ఎవ‌రు త‌రువాత‌?
X
మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల లాక్ డౌన్ పీరియ‌డ్ ని స‌జావుగా స‌ద్వినియోగం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎలాంటి కాల‌యాప‌నా లేకుండా.. వ‌రుస‌గా స్క్రిప్టులు వింటూ ద‌ర్శ‌కుల్ని ఫైన‌ల్ చేసే ప‌నిలో ప‌డ్డారు. ఖాళీ స‌మ‌యంలో రీమేక్ ల‌పైనా దృష్టి సారించారు.

మ‌ల‌యాళ బ్లాక్ స‌బ్ట‌ర్ `లూసిఫెర్` రీమేక్ కోసం తెలుగు స్క్రిప్ట్ ను మొదట `సాహో` ఫేం సుజీత్ రూపొందించారు. కానీ అత‌డి స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవిని ఆకట్టుకోలేదు. దాంతో మెగా డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ని రంగంలోకి దించారని ప్ర‌చార‌మైంది. ఇంత‌కుముందు మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీనంబ‌ర్ 150 ని ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా మ‌లిచిన ఘ‌న‌త వినాయ‌క్ సొంతం. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో వినాయ‌క్ ఆ మూవీని పెద్ద స‌క్సెస్ చేసి చూపించారు.

అందుకే లూసీఫ‌ర్ రీమేక్ బాధ్య‌త‌ను వినాయ‌క్ కి చిరు అప్ప‌గించారు. అయితే మ‌ల‌యాళ వెర్ష‌న్ తో పోలిస్తే తెలుగు వెర్ష‌న్ లో క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్దేందుకు విన‌య్ ఎక్కువ శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ట‌. అక్క‌డ మోహ‌న్ లాల్ కి హీరోయిన్ లేక‌పోయినా తెలుగు వెర్ష‌న్ లో చిరుకి ఒక అంద‌మైన క‌థానాయిక‌ను అలాగే పాట‌లు కూడా జోడిస్తున్నార‌ట‌. ఇక మెగాభిమానులు అన్న‌య్య నుంచి ఆశించే అన్ని అంశాల్ని ఏర్చి కూర్చేందుకు వినాయ‌క్ ప్రిపేర‌వుతున్నార‌ట‌. దీంతో ఈ ప్రాజెక్ట్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. ఈలోగానే చిరు మ‌రో రీమేక్ పైనా దృష్టి సారించారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `వేదాళం` రీమేక్ లో న‌టించేందుకు చిరు ప్రిపేర‌వుతున్నార‌ట‌. అంటే వినాయ‌క్ రేసులో వెన‌క్కి వెళితే మెహ‌ర్ ముందుకొచ్చార‌న్న‌ది తాజా గుస‌గుస‌. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సుంద‌ట‌. మ‌రి అప్ప‌టికి వినాయ‌క్ స్క్రిప్ట్ వంద‌శాతం రెడీ అవుతుందా లేదా? అన్న‌ది స‌స్పెన్స్.