Begin typing your search above and press return to search.
'శంకర్ - చరణ్' ప్రాజెక్ట్ లోకి ఎవరిని తీసుకుంటారో..!
By: Tupaki Desk | 26 May 2021 2:00 PM ISTదక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది చరణ్ కెరీర్ లో వస్తున్న 15వ సినిమా. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే 'RC15' లో చరణ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు టాక్ వచ్చింది. గతంలో 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ మరోసారి కనువిందు చేయనుందని అన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో చరణ్ సరసన నటిస్తున్న అలియా అయితే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఓకే చేస్తారో చూడాలి.
అయితే శంకర్ సినిమా అంటే హీరో హీరోయిన్లు ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంటుందని టాక్ ఉంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి రామ్ చరణ్ దీనికి రెడీగా ఉంటాడు. కానీ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటే బల్క్ డేట్స్ దొరకడం కష్టం. అందులోనూ భారీ స్థాయిలో సినిమాలు తీసే శంకర్.. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో చెప్పలేం అంటుంటారు. చరణ్ కి ఎలాగూ తప్పదు కనుక ఓకే. కానీ స్టార్ హీరోయిన్ ఉంటే షూటింగ్ లేట్ అయితే మాత్రం ఆమె డేట్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. మరి 'చరణ్-శంకర్' సినిమాలో చివరకు ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారో చూడాలి.