Begin typing your search above and press return to search.

ఇద్దరు భామలలో 'బెంగుళూరు నాగరత్నమ్మ' ఎవరు?

By:  Tupaki Desk   |   13 March 2022 5:00 AM IST
ఇద్దరు భామలలో బెంగుళూరు నాగరత్నమ్మ ఎవరు?
X
కొంతకాలంగా సమంత నాయిక ప్రధానమైన పాత్రలతో దూసుకుపోతోంది. ఆల్రెడీ 'యూ టర్న్' .. 'ఓ బేబీ' సినిమాలతో ఆమె భారీ విజయాలను అందుకుంది. ఎంతటి కథా భారాన్నైనా సమంత తన భుజాలపై మోయగలదని నిరూపించుకుంది. ఇక 'శాకుంతలం' వంటి నాయిక ప్రధానమైన సినిమా ఆమె నుంచి రానుంది. 'యశోద' వంటి ఒక థ్రిల్లర్ మూవీ సెట్స్ పై ఉంది. ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సమంత సతమతమైపోతోంది.

ఈ నేపథ్యంలోనే సీనియర్ సంగీత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 'బెంగుళూరు నాగరత్నమ్మ' అనే ఒక బయోపిక్ కి కథను రెడీ చేసుకుని చాలా కాలమే అయింది. ఇది ఒక దేవదాసీ కథ. ఈ కథను తెరపైకి తీసుకుని వెళ్లడానికి తగిన సమయం కోసం ఆయన చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ ఏడాదిలో తప్పకుండా ఈ సినిమా చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నారని అంటున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ కథకి సంభాషణలు రాస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథను సమంతకు వినిపించారట.

అయితే ఇంతవరకూ ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో అనుష్క ముందుకు ఈ కథను తీసుకుని వెళ్లారట. ఆమెకి కూడా పూర్తికథను వినిపించారని సమాచారం. నాయిక ప్రధానమైన పాత్రలను చేయడంలో అనుష్కకి మంచి క్రేజ్ ఉంది.

ఆమె సినిమాలకి వివిధ భాషల్లో మంచి మార్కెట్ ఉంది. ఆమె నుంచి వచ్చిన 'అరుంధతి' .. రుద్రమదేవి' .. 'భాగమతి' సినిమాలు కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. అయితే 'నిశ్శబ్దం' తరువాత ఆమె ఇంతవరకూ ఏ సినిమా ఒప్పుకోలేదు.

అలాంటి అనుష్క ముందుకు 'బెంగుళూరు నాగరత్నమ్మ' కథ వెళ్లింది. అయితే ఆమె నుంచి కూడా ఇంతవరకూ ఎలాంటి సమాధానం రాలేదు. ఈ ఇద్దరిలో ఎవరి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా వెంటనే షూటింగు మొదలుపెట్టాలనే ఉద్దేశంతో సింగీతం శ్రీనివాసరావు ఉన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన చేసుకుంటున్నారు. మరి ఈ ఇద్దరి భామలలో ఎవరి నుంచి ముందుగా గ్రీన్ సిగ్నల్ వస్తుందనేది చూడాలి.