Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ వ‌ర్సెస్ షారూక్.. బాల‌న్ ఫేవ‌రెట్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   9 Jun 2021 9:00 AM IST
స‌ల్మాన్ వ‌ర్సెస్ షారూక్.. బాల‌న్ ఫేవ‌రెట్ ఎవ‌రు?
X
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడులో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌తో ఆక‌ట్టుకున్నారు విద్యాబాల‌న్. అంత‌కుముందు సిల్క్ స్మిత జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన డ‌ర్టీ పిక్చ‌ర్ లో బోల్డ్ పెర్ఫామెన్స్ తో తెలుగు యువ‌త‌కు చేరువ‌య్యారు. పరిశ్రమలో అగ్రశ్రేణి కథానాయికలలో విద్యాబాలన్ ఒకరిగా వెలుగొందుతున్నారు. కొన్నేళ్లుగా ఎన్నో విల‌క్ష‌ణ చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన బాల‌న్ చివరిసారిగా `శకుంతల దేవి` చిత్రంలో ఎమోష‌న‌ల్ పాత్ర‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాలో బాల‌న్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిసాయి.

విద్యా ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. తన అభిమానులతో సరదాగా సంభాషించే అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌రు. ఆమె అభిమానులలో ఒకరు సల్మాన్ లేదా షారుఖ్ లలో ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరారు. బాల‌న్ మ‌రో ఆలోచ‌నే లేకుండా SRK ని ఎంచుకున్నారు.

విద్యాబాలన్ తన కెరీర్ ప్రారంభం నుండే ఎస్‌.ఆర్‌.కెపై విపరీతమైన ప్రేమను కలిగి ఉన్నాన‌ని అతనితో ఎప్పుడూ సినిమా చేయాలనుకుంటున్నాన‌ని తెలిపారు. కానీ అందుకు అవ‌కాశం రానేలేదు. బాల‌న్ తదుపరి అమెజాన్ ప్రైమ్ `షెర్ని`లో కనిపిస్తుంది.