Begin typing your search above and press return to search.

డిజిటల్ ప్ర‌మోష‌న్ ఏజెన్సీలో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్?

By:  Tupaki Desk   |   8 Dec 2020 7:00 PM IST
డిజిటల్ ప్ర‌మోష‌న్ ఏజెన్సీలో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్?
X
ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. కరోనా సంక్షోభం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ప‌దేళ్ల త‌రువాత రావాల్సిన విప్ల‌వాత్మ‌క మార్పులు కోవిడ్-19 రాకతో ఈ ఏడాదే వ‌చ్చేశాయి. ఇప్పటికే ఉన్న దిగ్గజ ఓటీటీలతో పాటు కొత్తగా వచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కూడా సత్తా చాటుతున్నాయి. గత కొన్ని నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా నడుస్తుండటంతో ప్రొడ్యూసర్స్ సైతం డిజిటిల్ ప్ర‌మోష‌న్స్ మీద ఫోక‌స్ పెడుతున్నారని తెలుస్తోంది.

కాగా, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇప్పుడు డిజిటల్ ప్రమోషన్ ఏజెన్సీ పై దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నైజాం డిస్ట్రీబ్యూష‌న్ లో త‌నదే పైచేయిగా సాగుత‌న్న దిల్ రాజు.. తాజాగా ఓ ప్రముఖ డిజిటల్ మీడియా ఏజెన్సీలో ఏంజెల్ ఇన్వెస్ట్ మెంట్ చేసిన‌ట్లుగా సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఓ కూట‌మిగా ఏర్ప‌డి డిజిటల్ ప్ర‌మోష‌న్ ఏజెన్సీ ప్రారంభించాలనే ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్లుగా ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాలి.