Begin typing your search above and press return to search.

బ‌న్నీ పార్టీలో స్పెష‌ల్ కిల్ల‌ర్ లేడీ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   15 April 2022 5:32 AM GMT
బ‌న్నీ పార్టీలో స్పెష‌ల్ కిల్ల‌ర్ లేడీ ఎవ‌రు?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విదేశీ వెకేష‌న్ ని ముగించి తిరిగి హైద‌రాబాద్ కి చేరుకున్నారు. విదేశాల్లో బ‌న్నీ బ‌ర్త్ డే పార్టీ చిలౌట్ ఒక రేంజులో సాగింద‌ని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. స్నేహ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఐరోపాలో బ‌ర్త్ డే వేడుకల నుండి కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. ఆమె తన స్టోరీస్ లో ఇతర స్నేహితులు పోస్ట్ చేసిన చిత్రాలను కూడా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బ‌న్నీతో పాటు స్నేహా రెడ్డి వారి స్నేహితులు ఉన్నారు. పార్టీ క్రౌడ్ ఒక రేంజులో క‌నిపిస్తోంది. వారం రోజుల క్రితం సెలవుపై ఈ జంట యూర‌ప్ కి వెళ్లారు. ఆ త‌ర్వాత‌ వారి విదేశీ సన్నిహితులు కొందరు చేరారు. బ‌న్నీ ఏప్రిల్ 8 న తన పుట్టినరోజును జరుపుకున్నారు.

గురువారం సెలవుల నుండి తిరిగి వచ్చిన ఈ జంట హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. విమానాశ్రయం నుండి ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. వాటిని కెమెరామేన్ లు బ‌న్నీ అభిమానుల సంఘాలు వైర‌ల్ గా షేర్ చేశారు. అయితే ఈ పార్టీలో బ‌న్నీతో పాటు సంద‌డి చేసిన ఆ స్పెష‌ల్ గాళ్ ఎవ‌రు? అంటూ ఇప్పుడు వాడి వేడిగా డిబేట్ ర‌న్ అవుతోంది. రింగుల జుత్తుతో వైబ్రేంట్ యాటిట్యూడ్ తో చిల్లింగ్ గా క‌నిపిస్తున్న స‌ద‌రు స్పెష‌ల్ గాళ్ ఎవ‌రో కానీ అంటూ డిబేట్ న‌డుస్తోంది.

అయితే స‌ద‌రు బ్యూటీ పేరు వాసుకి పుంజ్. టాలీవుడ్ క‌థానాయిక‌ల్ని మించి అందాల ఆర‌బోత‌లో టాప్ మోడ‌ల్స్ నే త‌ల‌ద‌న్నేస్తుంద‌ని త‌న ఇన్ స్టా ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కుముందు శిల్పా రెడ్డి - స‌మంత‌ల‌తోనూ ఈ బ్యూటీ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ఇప్పుడు బ‌న్నీ బర్త్ డే పార్టీలో బ‌న్నీతో పాటు దిగిన ఫోటోలు సంచ‌ల‌నంగా మారాయి. రింగుల జుత్తు సుంద‌రి హాటెస్ట్ లుక్స్ యువ‌త‌రం గుండెల్లో గుచ్చుకున్నాయి. చూస్తుంటే బ‌న్నీ న‌టిస్తున్న పుష్ప 2లో స్పెష‌ల్ నంబ‌ర్ లో త‌ళుక్కుమంటుందా ? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. పక్కా పార్టీ గాళ్ అనేందుకు చిహ్నంగా ఈ బ్యూటీ ఫోటోగ్రాఫ్స్ క‌నిపిస్తున్నాయి.

ఇక అల్లు అర్జున్ ఇటీవల 'పుష్ప- ది రైజ్' లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు వ‌సూలు చేసింది. పుష్పలో అర్జున్ లారీ డ్రైవర్ కం ఎర్ర‌ చందనం స్మగ్లర్ గా కనిపించాడు. ఈ చిత్రం రూ. కేవలం డబ్బింగ్ హిందీ వెర్షన్ నుంచే 100 కోట్లు రాబట్టింది. ఇందులో రష్మిక మందన్న - ఫహద్ ఫాసిల్ న‌టించారు. తెలుగులో చిత్రీకరించిన‌ పుష్పను హిందీ- తమిళం- మలయాళం- కన్నడ భాషలలో డబ్ చేసి విడుదల చేసారు. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కావడం అనేది అల్లు అర్జున్ కి ఇదే తొలిసారి.

రెండవ భాగాన్ని డిసెంబర్ 2022లో సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్ప‌టికే నిర్మాతలు ధృవీకరించారు. పుష్ప: ది రూల్ అనే టైటిల్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ రెండవ భాగం అల్లు అర్జున్ - ఫహద్ ల మధ్య జరిగే ఫేస్ టు ఫేస్ వార్ పై తెర‌కెక్క‌నుంది. పుష్ప కోసం పనిచేయడం అంటే నాలుగు సినిమాలు చేయడంతో సమానమని సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్ చెప్పారంటే దీనికోసం ఎంత‌గా శ్ర‌మించారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు పార్ట్ 2 కోసం అంత‌కుమించి హార్డ్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది.