Begin typing your search above and press return to search.

తార‌క్ 30 నుంచి అలియా ఎగ్జిట్ కి కార‌కులు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   16 April 2022 7:30 AM GMT
తార‌క్ 30 నుంచి అలియా ఎగ్జిట్ కి కార‌కులు ఎవ‌రు?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల్యాండ్ మార్క్ మూవీ 30వ చిత్రం కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్ లో ఉండ‌గానే ప్రాజెక్ట్ ని తార‌క్ ఫిక్స్ చేసారు. హీరోయిన్ గా బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ ని ఖార‌రు చేసారు. 'ఆర్ ఆర్ ఆర్' లో న‌టించిన అనుభ‌వం..అలియా తో స్నేహ‌భావ సంబంధంతో కాంబినేష్ బాగుంటుంద‌ని కొర‌టాల సైతం భావించి మ‌రో ఆలోచ‌న లేకుండా ఆ ద్వ‌యం అలియాభ‌ట్ని లాక్ చేసారు. ఆమె కూడా తార‌క్ తో న‌టించ‌డానికి ఎంతో ఉత్సాహం సైతం చూపించింది.

తార‌క్ మంచి స్నేహితుడంటూ 'ఆర్ ఆర్ ఆర్' ప్ర‌మోష‌న్ లో ఏ రేంజ్లో చెప్పుకొచ్చిందో తెలిసిందే. ఇలా ఎన్నో కార‌ణాలు అలియాభ‌ట్ ని తార‌క్ 30 వైపు ఉత్సాహం రేకెత్తించింది. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి అలియాభ‌ట్ త‌ప్పుకుంద‌ని స‌మాచారం. అలియాభ‌ట్ కి ఉన్న బిజీ షెడ్యూల్ కార‌ణంగా డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో ప్రాజెక్ట్ నుంచి నిష్ర్క‌మించిద‌ని మీడియా క‌థ‌నాలు హీటెక్కిస్తున్నాయి. తార‌క్- కొర‌టాల ఎంత రిక్వెస్ట్ చేసినా స‌ర్దుబాటు క‌ష్ట‌మంటూ ఎగ్జిట్ వైపే మొగ్గు చూపిన‌ట్లు గుస‌గుస వినిపిస్తోంది.

అయితే అలియాభ‌ట్ పెళ్లి త‌ర్వాత ఈ వార్త బ‌య‌ట‌కు రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 14వ తేదీన ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ్ వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ తంతు పూర్త‌యిన వెంట‌నే తార‌క్ సినిమా విష‌యం తెర‌పైకి వ‌చ్చింది.

అంటే అలియాభ‌ట్ డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం భ‌ర్త ర‌ణ‌బీర్ క‌పూర్ నా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తోంది. తార‌క్ ఈ చిత్రాన్ని జూన్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్నారు.

17 త‌ర్వాత ర‌ణ‌బీర్ -అలియా ఆప్రియా కి హ‌నీమూన్కి వెళ్ల‌బోతున్నారు. కొన్ని రోజుల పాటు అక్క‌డే గ‌డ‌ప‌నున్నారు. అనంత‌రం తిరిగొచ్చి హిందీ ప్రాజెక్ట్ లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో అలియా డేట్లు క్లాష్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రీజ‌న్ కాక‌పోతే గ‌నుక పెళ్లి త‌ర్వాత తెలుగు సినిమాలు వ‌ద్దు అని అని ర‌ణ‌బీర్ ఏమైనా ఆంక్ష‌లు విధించాడా? అన్న మ‌రో కార‌ణం తెర‌పైకి వ‌స్తుంది.

స‌ర్దుబాటు చేయాల‌నుకుంటే డేట్లు ఎలాగైనా చేయ‌వ‌చ్చు. అడ్జ‌స్ట్ చేయ‌డానికి వీలులేని పరిస్థితులు క‌ల్పించిన‌ప్పుడే ఇలాంటి ట్విస్ట్ లు ఎదుర‌వుతుంటాయి. మ‌రి బ్యాకెండ్ అస‌లేం జ‌రుగుతుంది అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం కొర‌టాల కొత్త హీరోయిన్ అన్వేష‌ణ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.