Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు...?

By:  Tupaki Desk   |   10 July 2020 6:00 AM GMT
రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ముందు నుంచే ప్రచారంలో ఉన్న 'రాధే శ్యామ్‌' అనే టైటిల్‌ ను ప్రభాస్ కోసం ఫైనల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా కాన్సెప్ట్‌ ను ప్రతిభింబించేలా డిజైన్‌ చేసారు. దీంట్లో డార్లింగ్ ప్రభాస్‌ మరియు పూజాహెగ్డే గ్రాండియర్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఫస్ట్ లుక్‌ లోనే రొమాంటిక్‌ మూడ్‌ లో ఉన్న ప్రభాస్‌ - పూజాహెగ్డేల స్టిల్‌ ను రివీల్ చేయడంతో ఇదో ఫ్యూర్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది. 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేషమైన స్పందన వస్తోంది.

ఇక ఈ చిత్రానికి 'జిల్‌' ఫేమ్ రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో 'రాధే శ్యామ్' మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ స్టార్ట్ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. చాలా రోజుల నుండి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటూ రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంగీత దర్శకుడు ఎవరనేది క్లారిటీ వస్తుందని అభిమానులు భావించారు.

అయితే చిత్ర యూనిట్ మాత్రం 'రాధే శ్యామ్' మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ మెన్షన్ చేయలేదు. దీంతో ఇప్పుడు ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్.. మూవీకి సంగీతం ఎవరు అందించబోతున్నారు..? 'సాహో'లాగే ఈ సినిమాకు కూడా అవుతుందా అని సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'సాహో' సినిమాకి కూడా ముందు నుండి సంగీతం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. చివరికి మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. దీంతో మ్యూజిక్ విషయంలో కొంత నిరాశకు గురయ్యారు సినీ అభిమానులు.

ఇప్పుడు 'రాధే శ్యామ్' కి కూడా మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. మరి మేకర్స్ ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కాగా 'బాహుబలి' 'సాహో' లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో 'రాధే శ్యామ్' ని కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను 2021లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.