Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 5 హోస్ట్‌ ఎవరు?

By:  Tupaki Desk   |   14 Dec 2020 8:57 AM IST
బిగ్‌ బాస్‌ 5 హోస్ట్‌ ఎవరు?
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఫైనల్‌ వారంకు వచ్చేసింది. మరో ఆరు ఏడు రోజుల్లో షో ముగియబోతుంది. ఈ ఏడాది బిగ్‌ బాస్‌ సీజన్‌ ఉంటుందా లేదా అనే అనుమానాలు చాలా వ్యక్తం అయ్యాయి. కరోనా కారణంగా బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా భయపడ్డారు. కాస్త ఆలస్యంగా అయిన తెలుగు బిగ్‌ బాస్‌ ను ప్రారంభించారు. తెలుగు నిర్వాహకులు ఇచ్చిన ధైర్యంతో హిందీ తమిళంలో కూడా షురూ అయ్యింది. తెలుగు బిగ్‌ బాస్‌ ప్రతి సీజన్‌ ఆరంభం సమయంలో హోస్ట్‌ గురించిన చర్చలు.. రచ్చ జరుగుతూనే వస్తోంది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా చేయగా రెండవ సీజన్‌ కు నాని మూడు నాల్గవ సీజన్‌ లకు నాగార్జున చేశాడు. ఇక వచ్చే ఏడాది రాబోతున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 హోస్ట్‌ ఎవరు అనే చర్చ ఇప్పటి నుండే మొదలు అయ్యింది.

నాగార్జున బిగ్‌ బాస్‌ కు హోస్టింగ్‌ బాగానే చేస్తున్నాడు. కాని ఆయన పలు కారణాల వల్ల సీజన్‌ 5 ని నిర్వహించాలని కోరుకోవడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది. సీజన్‌ 4 విషయంలోనే ఆయన నిరాశక్తి చూపించగా కోవిడ్‌ టైం అవ్వడంతో కొత్త వారితో కంటే మీరు అయితేనే బెటర్‌ అన్నట్లుగా నిర్వాహకులు ఒప్పించారట. స్టార్‌ మా తో ఉన్న బాండింగ్‌ తో నాగ్‌ కాదనలేక పోయాడు. సీజన్‌ 5 విషయంలో నాగార్జున ముందు నుండే నో చెబుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దాంతో సీజన్‌ 4 పూర్తి అయిన వెంటనే సీజన్‌ 5 కోసం హోస్ట్‌ ను నిర్వాహకులు వెదికే పని మొదలు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు.

ఈ సీజన్‌ లో దసరా ఎపిసోడ్‌ కు హోస్టింగ్ చేసి ప్రశంసలు దక్కించుకున్న సమంత సీజన్‌ 5 కు ఫుల్ టైమ్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తే బాగుంటుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ మా కూడా ఆ విషయాన్ని పరిశీలిస్తుందనే వార్తలు వస్తున్నాయి. సమంత హోస్టింగ్‌ చేస్తూనే ఉంది. సామ్ జామ్‌ తో మరింతగా హోస్ట్‌ గా పాపులారిటీ అనుభవం దక్కించుకుంటుంది కనుక బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ను ఆమె చేతిలో పెడితే ఎలా ఉంటుందని నిర్వాహకులు ఆలోచిస్తున్నాట. ఇలాంటి వార్తలు ఇంకా ఎన్నెన్ని వినాల్సి వస్తుందో. వచ్చే ఏడాది జూన్‌ లేదా జులైలో సీజన్‌ 5 మొదలయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు 10 మంది పేర్లు అయినా మీడియాలో ప్రచారం జరగవచ్చు. అందులో ఎవరు ఫైనల్‌ అనేది తేలాలంటే ఇంకా చాలా టైం వెయిట్‌ చేయాల్సిందే.