Begin typing your search above and press return to search.

శంకర్​​-చరణ్​ సినిమాలో హీరోయిన్​ ఎవరు? రోజుకో భామ పేరు తెరపైకి..!

By:  Tupaki Desk   |   14 March 2021 6:30 AM GMT
శంకర్​​-చరణ్​ సినిమాలో హీరోయిన్​ ఎవరు? రోజుకో భామ పేరు తెరపైకి..!
X
మెగా పవర్​స్టార్​ చరణ్ ప్రస్తుతం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాతో పాటు ఇండియాలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ' రౌద్రం రణం రుధిరం” లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో మరో హీరో జూనియర్​ ఎన్టీఆర్​ కూడా నటిస్తున్నారు. కొమురం భీంగా జూనియర్​ ఎన్టీఆర్​.. అల్లూరి సీతారామరాజుగా రామ్​ చరణ్​ నటిస్తుండటంతో ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే ఆచార్యలోనూ చరణ్​ కనిపించబోతున్నారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రెండు భారీ బడ్జెట్​ సినిమాలు పూర్తికాగానే.. మరో సెన్షేషనల్​ చిత్రంలో చరణ్​ హీరోగా నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్​ దర్శకత్వంలో చరణ్​ నటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్​మెంట్​ కూడా వచ్చేసింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.శంకర్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. మాస్ హీరో అయిన చరణ్ ని శంకర్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడా అని అందరూ వేచి చేస్తున్నారు.

శంకర్ సినిమాలో నటించే హీరోయిన్ అంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. శంకర్ సినిమాలో భారీగా తెరకెక్కించడం తోపాటు హీరోయిన్ లను గ్లామర్ గా చూపించడంలోనూ దిట్ట. సాంగ్స్ షూట్ చేయడానికి కూడా ఎంతో ఖర్చు పెట్టిస్తారు. చరణ్ శంకర్ కాంబో గురించి ఎన్నో విశేషాలు బయటకు వినిపిస్తున్నా అసలు ఈ సినిమాలో హీరోయిన్​ ఎవరు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

ముందుగా రష్మిక చేయబోతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొరియన్ నటి బే సుజీ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పుడు కియారా అద్వాని పేరు వినిపిస్తున్నది. అయితే చరణ్​ పక్కన నటించే ఛాన్స్ ఎవరిది దక్కిందో అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మరి దర్శకుడు శంకర్ కానీ నిర్మాత దిల్ రాజు కానీ తొందర్లోనే క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.