Begin typing your search above and press return to search.

`ఛ‌త్ర‌ప‌తి` హిందీ రీమేక్ లాంచ్ గెస్ట్ ఎవ‌రంటే..?

By:  Tupaki Desk   |   15 July 2021 5:05 AM GMT
`ఛ‌త్ర‌ప‌తి` హిందీ రీమేక్ లాంచ్ గెస్ట్ ఎవ‌రంటే..?
X
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామా ఛ‌త్ర‌ప‌తి హిందీలో రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 2005 లో ఈ సినిమా రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దాదాపు 16 ఏళ్ల త‌ర్వాత ఇది బాలీవుడ్ లో రీమేక‌వుతుండ‌డం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది. హిందీ బెల్ట్ లో బాహుబ‌లి ద‌ర్శ‌కుడి సినిమా అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తుంటే అది కాస్తా వైర‌ల్ గా మారుతోంది.

ఇక ఈ చిత్రంతో తెలుగు యువ‌హీరో బెల్లం కొండ సాయి శ్రీ‌నివాస్ హిందీ చ‌ల‌న‌చిత్ర సీమ‌లో అడుగుపెడుతున్నాడు. ఈ మూవీలో భీక‌ర రూపం కోసం అత‌డు జిమ్ కి వెళ్లి భారీగా కండ‌లు పెంచుతున్నాడు. ప్ర‌తిదీ ఛాలెంజింగ్ గా తీసుకుని స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ బౌండ్ స్క్రిప్టుతో ప‌నుల‌ను వేగ‌వంతం చేశార‌ని తెలిసింది.

ఈ శుక్ర‌వారం (జూలై 16న‌) రీమేక్ ని ప్రారంభించ‌నున్నారు. పూజాకార్య‌క్ర‌మాల‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న‌ది ఎవ‌రో తెలిస్తే అంద‌రూ స‌ర్ ప్రైజ్ అవ్వాల్సిందే. ఛ‌త్ర‌ప‌తి ఒరిజిన‌ల్ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఈ పూజా కార్య‌క్ర‌మాల‌కు విచ్చేస్తార‌ని తెలిసింది. హిందీ మూవీ కాబ‌ట్టి ముంబైలోనే ప్రారంభిస్తున్నారా? లేక హైద‌రాబాద్ లోనే లాంఛ‌నంగా ప్రారంభిస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.