Begin typing your search above and press return to search.

అవార్డుల‌ వేడుక‌లో క్యాట్ వాక్ భామ‌లు

By:  Tupaki Desk   |   11 Dec 2019 7:00 AM IST
అవార్డుల‌ వేడుక‌లో క్యాట్ వాక్ భామ‌లు
X
ముంబై- దిల్లీ వంటి మెట్రోల్లో నిరంత‌రం ఏదో ఒక అవార్డ్ ఫంక్ష‌న్ హంగామా న‌డుస్తూనే ఉంటుంది. ఈ క‌ల్చ‌ర్ ని హాలీవుడ్.. పాశ్చాత్య టీవీ రంగం నుంచి బాలీవుడ్ టీవీ ప‌రిశ్ర‌మ ద‌శాబ్ధాల క్రిత‌మే అడాప్ట్ చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ అదే బాట‌లో వెళుతోంది. సినిమా - టీవీ రంగంతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఈ త‌ర‌హా అవార్డ్ వేడుక‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. తాజాగా దిల్లీలో స్టార్ స్క్రీన్స్ అవార్డ్స్ 2019 వేడుకలు మ‌రోసారి హీటెక్కించాయి. బాలీవుడ్ తారాతోర‌ణం ఈ అవార్డ్స్ వేడుక‌ల్లో అద‌రగొట్టారు.

అందాల క‌థానాయిక‌లంతా ఒకే వేదిక‌పై అదిరే ట్రీటిచ్చార‌నే చెప్పాలి. దీపిక నుంచి నేటిత‌రం న‌ట‌వార‌సురాళ్లు అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ లుక్ తో మ‌తి చెడ‌గొట్టారు. స్టైల్ ఐక‌న్స్ గా.. యూత్ హార్ట్ బీట్ కి చేరువయ్యేలా అల్ట్రా మోడ్ర‌న్ ఫ్యాష‌న్స్ ని ఎలివేట్ చేయ‌డంలో ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ్డారు.

దీపిక హాఫ్ షోల్డ‌ర్ బ్లాక్ డిజైన‌ర్ డ్రెస్ లుక్ .. అన‌న్య పాండే .. ఓపెన్ టాప్ ఛ‌మ్కీ మిడ్డీ లుక్ .. సారా అలీఖాన్ .. చుక్క‌ల డిజైన్ బ్లాక్ షేడ్ డ్రెస్ ..కియ‌రా నేవీ బ్లూ ఫ్లోర‌ల్ థై స్లిట్ డ్రెస్ ..ఆలియా భ‌ట్ స్ట‌న్నింగ్ శారీ లుక్ .. ఒక‌రిని మించి ఒక‌రు రెడ్ కార్పొట్ ని హీటెక్కించారు. ప‌లువురు అంద‌గ‌త్తెల‌తో పాటుగా.. క‌థానాయిక‌లు ఈ వేడుకలో త‌ళుక్కున మెరిసారు. ర‌ణ‌వీర్ సింగ్ - దీపిక జంట‌... విక్కీ కౌశ‌ల్-ఆలియా స్కిట్ వ‌గైరా ఈ అవార్డు వేడుక‌ల్లో హైలైట్ అనే చెప్పాలి.