Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్-బాలయ్యల చిట్ చాట్..వీడియో తీసిందెవరు?
By: Tupaki Desk | 1 Sept 2018 11:14 PM ISTఏపీ సీఎం చంద్రబాబు, బాలయ్య..... ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందని కొంతకాలంగా వదంతులు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, నందమూరి హరికృష్ణ అకాల మరణం తర్వాత ఆ ముగ్గురు కలిసి ఉన్న చాలా ఫొటోలు, వీడియోలు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజా కలయికతో వారు కలసిపోయినట్లేనని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. అయితే, తాజాగా హరికృష్ణ చిన్న కర్మ కార్యక్రమం సందర్భంగా బాలయ్య - కల్యాణ్ రామ్ - ఎన్టీఆర్ లు ముచ్చటించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా అటువంటి కార్యక్రమాల్లో ఫొటోలు - వీడియోలు అనుమంతించరు. అందులోనూ, కల్యాణ్ రామ్ - ఎన్టీఆర్-బాలయ్య బఫే భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటుంటే అంత ధైర్యంగా వీడియో షూట్ చేయడం సాధ్యం కాదు.
పబ్లిక్ ప్లేసులో వారు మాట్లాడుకున్న ఫొటోలు - వీడియో బయటకు రావడం విశేషం కాదు. కానీ, వ్యక్తిగత కార్యక్రమం జరుగుతుండా వీడియో తీయడం...అందులోనూ బాలయ్య బాబు - ఎన్టీఆర్ లను అతి దగ్గరగా చిత్రీకరించడం ఆలోచించదగ్గ విషయం. బాలయ్య - ఎన్టీఆర్ లకు తెలియకుండా ఆ వీడియో తీయడం దాదాపుగా అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నందమూరి కుటుంబంలో విభేదాలు లేవు అని, వారు కలిసిపోయారని చెప్పడం కోసమే...ఆ వీడియోను నందమూరి కుటుంబ సన్నిహితులు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ తో బాలయ్య - చంద్రబాబులకు గ్యాప్ లేదని చెప్పేందుకు ఈ వీడియోను లీక్ చేసినట్లుందని కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఒక్క వీడియోనే కాదు మిగతా ఫొటోలు కూడా కావాలనే తీసినట్లు కనిపిస్తోంది. నందమూరి కుటుంబంలో ప్యాచ్ అప్ జరిగిందని ప్రూవ్ చేయడానికి ఎవరో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ రకంగా నందమూరి ఫ్యామిలీ కూడా ఆ సందేశాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఉందని టాక్. లేదంటే అన్ని ఫొటోలు, వీడియోలు అంత దగ్గరగా తీయడం సాధ్యం కాదని మరోవాదన ఉంది. అయితే, ఆ బఫేలో క్యాటరింగ్ చేసే వ్యక్తి తన చొక్కా జేబులో మొబైల్ పెట్టుకొని ఇదంతా రికార్డు చేశాడని, అందుకే బఫే టేబుల్ దగ్గరకు వచ్చే పోయే వారిని కవర్ చేశాడని కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా..నందమూరి కుటుంబం కలిసిపోయిందని చేసిన ప్రయత్నం దాదాపుగా సక్సెస్ అయిందనే చెప్పవచ్చు.