Begin typing your search above and press return to search.

సీత ల‌క్ష్మ‌ణుడు స‌రే.. `ఆంజ‌నేయుడు` ఎవ‌రు?

By:  Tupaki Desk   |   29 Nov 2020 9:50 AM GMT
సీత ల‌క్ష్మ‌ణుడు స‌రే.. `ఆంజ‌నేయుడు` ఎవ‌రు?
X
ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్ 3డి` గురించి దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. తానాజీ 3డి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా హాలీవుడ్ స్టాండార్డ్స్ ఆవిష్క‌రించిన ఓంరౌత్ తో ప్ర‌భాస్ ఈ స‌రికొత్త ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఆదిపురుష్ 3డి మ‌రో మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్ వండ‌ర్ అవుతుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. ఇండియ‌న్ సినిమాని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లే కాంబో ఇద‌న్న ప్ర‌చారం హీటెక్కిస్తోంది. బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ అంత‌కుమించిన ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటూ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆదిపురుష్ 3డి ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స‌హా కాస్టింగ్ ఎంపిక‌లో బిజీగా ఉన్న ఓంరౌత్ ఇంకా చాలా ప‌నుల్ని వేగంగా పూర్తి చేసి జ‌న‌వ‌రి నుంచి సెట్స్ కెళ్లాల‌నే పంతంతో ఉన్నాడ‌ట‌. ఇప్ప‌టికే శ్రీ‌రాముడిగా ప్ర‌భాస్ .. రావ‌ణుడిగా సైఫ్ ఖాన్ ని ఫైన‌ల్ చేసేశాడు. సీత‌గా కృతి స‌నోన్.. ల‌క్ష్మ‌ణుడిగా సోనుకి టిటు కీ స్వీటీ ఫేం స‌న్నీ సింగ్ న‌టిస్తార‌ని గుస‌గుసలు ఆస‌క్తిని పెంచాయి.

ఇప్ప‌టికే ల‌క్ష్మ‌ణుడు పాత్ర‌ధారి స‌న్నీ సింగ్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అదంతా స‌రే కానీ.. రామాయ‌ణం స్ఫూర్తితో తెర‌కెక్క‌నున్న‌ ఈ మూవీలో అత్యంత కీల‌క‌మైన ఆంజ‌నేయుడి పాత్ర ఉంటుందా? ఉంటే ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? వాలి సుగ్రీవుల పాత్ర‌లు ఉంటే వాటికి ఎవ‌రిని ఎంపిక చేస్తారు? ల‌ంకేయుని సోద‌రి శూర్ప‌ణ‌ఖ‌గా ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌వి కూడా ఆస‌క్తిక‌రంగా మారాయి. లేదూ ఈ ఫిక్ష‌న‌ల్ సినిమాలో ఆ పాత్ర‌ల్ని ఓంరౌత్ హైడ్ చేస్తున్నారా? అన్న‌ది కూడా తేలాల్సి ఉంటుంది. ప్ర‌భాస్ గెట‌ప్ ఈ మూవీలో అవ‌తార్ త‌ర‌హాలో నీలం వ‌ర్ణంలో ఉంటుంద‌ని పురాణాల్లో శ్రీ‌రాముడిని త‌ల‌పిస్తాడ‌ని కూడా ముచ్చ‌ట సాగుతోంది.