Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ కు ఉచిత సలహాలు ఎవరిచ్చారంటే..??

By:  Tupaki Desk   |   20 March 2021 4:00 PM IST
స్టార్ హీరోయిన్ కు ఉచిత సలహాలు ఎవరిచ్చారంటే..??
X
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ముంబైబ్యూటీ పూజాహెగ్డే హవా మాములుగా లేదు. తెలుగులో వరుసగా భారీ సినిమాలతో బిజీ బిజీగా మారింది. అరవిందసమేత, గడ్డలకొండ గణేష్, మహర్షి లాంటి సూపర్ హిట్స్ తర్వాత గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అలవైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ తో రాధేశ్యామ్, అక్కినేని అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలను ఫినిష్ చేసిందట పూజా. అయితే పూజ ఈ మధ్య ఏ సినిమాలో కనిపించినా హిట్టే అనే భావన కలిగించింది. అందుకే అమ్మడిని అంతా గోల్డెన్ హ్యాండ్ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

ఇటీవలే మెగాస్టార్ ఆచార్య సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో రాంచరణ్ జోడిగా నటించింది పూజా. ఆచార్య సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా.. పూజా తాజాగా తన తమ్ముడికి సంబంధించిన ఓ క్రేజీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది. క్యారెవన్ లో ఆమె తమ్ముడు రిషబ్ హెగ్డే.. ఇటీవలే పట్టాపొందిన ఆర్థోపెడిషియన్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలో ఉచిత సలహాలు ఇస్తున్నాడు.. అంటూ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా నటించిన రాధేశ్యామ్ సినిమా జులై 30న రిలీజ్ కానుంది. ఇవేగాక బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ సరసన 'సర్కస్', కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో 'కబీ ఈద్ కబీ దీవాలి' సినిమాలు చేస్తోంది అమ్మడు. వీటితో పాటు దళపతి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.