Begin typing your search above and press return to search.

బ‌న్నీకి పాన్ ఇండియా రేంజ్ స‌క్సెస్ ఇచ్చేది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   25 May 2020 6:45 AM GMT
బ‌న్నీకి పాన్ ఇండియా రేంజ్ స‌క్సెస్ ఇచ్చేది ఎవ‌రు?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. అల వైకుంఠ‌పుర‌ములో (2020) స‌క్సెస్ బ‌న్ని స్థాయిని అమాంతం పెంచింది. రంగ‌స్థ‌లం చిత్రం త‌ర్వాత‌ నాన్ బాహుబ‌లి రికార్డును తిర‌గరాసిన చిత్రంగా అల వైకుంఠ‌పుర‌ములో నిలిచింది. ఈ స్థాయి విజ‌యం కోసం అత‌డు ఏడాది పైగానే వేచి చూడాల్సి వ‌చ్చింది. అయితేనేం... ప్ర‌స్తుతం స‌క్సెస్ ఇచ్చిన కిక్కులో వ‌రుసగా ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్ల‌ను క్యూలో పెట్టాడు.

ఇప్ప‌టికే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప` టైటిల్ లుక్ ని రిలీజ్ చేశారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిది. రంగ‌స్థ‌లం చిట్టిబాబు పాత్ర‌ను మించి తాజా చిత్రంలో బ‌న్నీని చూపించ‌బోతున్నాడ‌ట‌. పుష్ప‌లో అత‌డు పూర్తి మాస్ అవ‌తారంలో క‌నిపించ‌నున్నాడు. ఆ త‌ర్వాతా బ‌న్నీ వెంట పెద్ద లైన‌ప్ ఉంది. అందులో కొర‌టాల శివ‌.. సురేంద‌ర్ రెడ్డి.. త్రివిక్ర‌మ్ పేర్లు వ‌రుస‌గా వినిపిస్తున్నాయి. వీళ్ల‌తో పాటు ఏ.ఆర్. మురుగ‌దాస్ సైతం బ‌న్నితో సినిమా చేసేందుకు వేచి చూస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.

అయితే ఇంత‌మందిలో ఎవ‌రు బ‌న్నీని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు? అన్న‌దే ఇప్పుడు కీల‌కంగా మారింది. పాన్ ఇండియా సినిమా తీస్తే స‌రిపోదు.. స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇవ్వాల్సి ఉంటుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప పాన్ ఇండియా కేట‌గిరీలో ఏమేర‌కు స‌క్సెస‌వుతుంది? అన్న‌ది ఇంపార్టెంట్. త‌దుప‌రి కొర‌టాల‌.. సురేంద‌ర్ రెడ్డి అదే త‌ర‌హా సినిమాల్ని ప్లాన్ చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. మ‌రోవైపు మురుగ‌దాస్ తో సినిమా షూటింగ్ జ‌రుగుతోంద‌ని ఇంత‌కుముందు ప్ర‌చారం సాగింది. కానీ అది ప్ర‌స్తుతానికి హోల్డ్ లో ఉంది. ఇంత‌మంది ద‌ర్శ‌కుల్లో బ‌న్నీని పాన్ ఇండియా లెవ‌ల్లో క్రేజు పెంచేది ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్.