Begin typing your search above and press return to search.
ఈసారి వర్మను ఏకంగా కొట్టి ఆసుపత్రిలో పడేశారు
By: Tupaki Desk | 28 July 2020 1:20 PM ISTఈ కరోనా టైమ్ లో కూడా వరుసగా చిత్రాలు చేసి డిజిటల్ వేదికగా విడుదల చేస్తున్న వర్మ పవర్ స్టార్ అనే చిత్రంతో పెద్ద వివాదాన్నే మొదలు పెట్టాడు. పవన్ కళ్యాణ్ పై వర్మ తీసిన ఆ సినిమా ఇప్పటికే విడుదల అయ్యింది. పవర్ స్టార్ కు పోటీగా రూపొందిన పరాన్నజీవి చిత్రం కూడా విడుదల అయ్యింది. వర్మకు వ్యతిరేకంగా మరికొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. ఆర్జీవీ అంటూ వర్మ బయోపిక్ ను జొన్నవిత్తుల సినిమా తీస్తున్నాడు. డేరా బాబా కూడా వర్మపై రూపొందుతున్నదే. ఇవి కాకుండా నీలకంఠ దర్శకత్వంలో ఆర్జీవీపై ఒక సినిమా రూపొందుతుందట.
వర్మ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెడ్ పై మాస్క్ పెట్టుకుని తలకు కట్టుకట్టుకుని ఉన్న వర్మతో పాటు ఆయన తల పై శ్రీదేవి ఫొటో ను కూడా ఇందులో చూడవచ్చు. ఈ సినిమాకు ‘ఎవడ్రా నన్ను కొట్టింది’ అనే టైటిల్ ను పెట్టారట. సినీ లవర్స్ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వర్మను కొట్టి బెడ్ పై పడేసిన వారు ఎవరు అనే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు.
సినిమాలో తనను కొట్టింది ఎవరు అని తెలుసుకునేందుకు వర్మ ఆరు నెలల పాటు జుట్టు పీక్కుంటాడట. అతడి ఆ ఆరు నెలల ఫీలింగ్స్ ను ఇందులో ఫన్నీగా చూపించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వర్మను ఈ సినిమాలో చాలా ఫన్నీగా చూపించబోతున్నట్లుగా అనుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ తో పాటు వర్మను వ్యతిరేకించే వారికి ఇది మస్త్ మజా ఇస్తుందని అంటున్నారు.