Begin typing your search above and press return to search.

ఓటీటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వారు వీరేనట.. లిస్టు లీక్?

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:41 AM GMT
ఓటీటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వారు వీరేనట.. లిస్టు లీక్?
X
మొన్నీమధ్యనే బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి కావటం.. మళ్లీ ఏడాది వరకు బిగ్ బాస్ లేదని ఫీలయ్యే వారికి కింగ్ నాగ్ చెప్పిన స్వీట్ న్యూస్ వారినెంతో ఆనందానికి గురి చేయటం తెలిసిందే.

బుల్లితెర మీద కాకుండా ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు ‘‘బిగ్ బాస్ నాన్ స్టాప్’’ పేరుతో ప్రఖ్యాత ఓటీటీ వేదిక డిస్నీ హాట్ స్టార్ లో ఈ నెల 26 నుంచి ప్రసారం కానుంది.

దీనికి కింగ్ నాగార్జుననే హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదల కావటం.. బిగ్ బాస్ అభిమానులకు మరింత ఆనందాన్ని తెచ్చి పెట్టింది.

మరో.. పది రోజుల్లో మొదలయ్యే ఈ ఓటీటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేదెవరు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అధికారికంగా ఈ జాబితాను విడుదల చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన సమాచారం లీకైంది.

వీరి అంచనా ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 5 వరకు హౌస్ మేట్స్ గా ఉన్న వారిలో సీజన్ కు ఇద్దరు చొప్పున తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వారితో పాటు.. మరికొంతమందిని ఈ ఓటీటీ సీజన్ కు ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

ఓటీటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తుంది. ఇందులో ఎంత మంది కరెక్టు అన్నది తేలాలంటే మాత్రం మరో పది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక.. కంటెస్టెంట్ల పేర్ల విషయానికి వస్తే..

1. ముమైత్‌ ఖాన్‌(సీజన్‌-1)
2. ధనరాజ్‌(సీజన్‌-1)
3. ఆదర్శ్‌( సీజన్‌-1)
4. తనీష్‌(సీజన్‌-2)
5. అషు రెడ్డి( సీజన్‌-3)
6.మహేష్‌ విట్టా(సీజన్‌-3)
7. అరియానా(సీజన్‌-4)
8.అఖిల్‌ సార్థక్‌(సీజన్‌-4)
9. సరయూ( సీజన్‌-5)
10. హమీదా( సీజన్‌-5)
11.నటరాజ్‌ మాస్టర్‌ (సీజన్‌-5)
కోత్తగా యాడ్ కాబోతున్న కంటెస్టెంట్లు ఎవరంటే?
12. యూట్యూబర్‌ నిఖిల్‌
13. యాంకర్‌ శివ
14. యాంకర్‌ స్రవంతి
15. ఆర్జే చైతు
16. మోడల్‌ అనిల్‌ రాథోడ్‌ (మిస్టర్‌ ఇండియా 2021)
17.బమ్‌ చిక్‌ బబ్లూ
18. మోడల్‌ మిత్రా శర్మ (నటి)